అతిపెద్ద డైమండ్‌ వెలికితీత

మరో అత్యంత అరుదైన, నాణ్యమైన పెద్ద డైమండ్ బయటపడింది. ఉత్తర అమెరికాలో డైవిక్ డైమండ్ గనుల్లో ఈ వజ్రాన్ని కనుగొన్నారు. ఈ వజ్రం నాణ్యత 552 క్యారెట్లు. ఇంత నాణ్యమైన వజ్రం ఇప్పటి వరకు లభించలేదు. గతంలో లభించిన వాటిలో అత్యంత నాణ్యమైన వజ్రం 187 క్యారెట్లు. ప్రస్తుతం బయటపడ్డ 552 క్యారెట్ల వజ్రం ఎల్లో రంగులో ఉంది. కోడి గుడ్డు సైజులో ఉంది. ఈ వజ్రాన్ని ఇప్పుడే విక్రయించబోమని గనుల యజమాని చెప్పారు. వజ్రాన్ని సరైన […]

Advertisement
Update:2018-12-18 04:46 IST

మరో అత్యంత అరుదైన, నాణ్యమైన పెద్ద డైమండ్ బయటపడింది. ఉత్తర అమెరికాలో డైవిక్ డైమండ్ గనుల్లో
ఈ వజ్రాన్ని కనుగొన్నారు.

ఈ వజ్రం నాణ్యత 552 క్యారెట్లు. ఇంత నాణ్యమైన వజ్రం ఇప్పటి వరకు లభించలేదు. గతంలో లభించిన వాటిలో అత్యంత నాణ్యమైన వజ్రం 187 క్యారెట్లు. ప్రస్తుతం బయటపడ్డ 552 క్యారెట్ల వజ్రం ఎల్లో రంగులో ఉంది. కోడి గుడ్డు సైజులో ఉంది. ఈ వజ్రాన్ని ఇప్పుడే విక్రయించబోమని గనుల యజమాని చెప్పారు.

వజ్రాన్ని సరైన ఆకృతిలో కట్‌ చేసి. పాలిష్ చేసిన తర్వాత విక్రయిస్తామని చెప్పారు. అతి భారీ వజ్రంగా భావిస్తున్న దీని విలువ కూడా రికార్డు స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.

అయితే దీన్ని ఖచ్చితమైన ధరను ఇప్పుడే చెప్పలేమని… మెరుగులు దిద్దిన తర్వాత ఒక అంచనాకు రావొచ్చు అని వజ్రవ్యాపార నిపుణులు చెబుతున్నారు.

మన దేశం నుంచి ఇంగ్లండ్‌ తరలిపోయిన కొహినూర్ డైమండ్‌ 105.6 క్యారెట్లు.

Tags:    
Advertisement

Similar News