ప్రొడక్ట్ ప్రమోషన్‌కు ఇదో జిమ్మిక్
స్మార్ట్ ఫోన్… ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. తిండి లేకుండా ఒకరోజు ఉంటారేమో కానీ…స్మార్ట్ ఫోన్ లేనిది నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. అంతేకాదు స్మార్ట్ ఫోన్ మన జీవితంలో భాగంగా మారింది. అయితే మీరు స్మార్ట్ ఫోన్‌ను ఒక ఏడాది కాలం పాటు పక్కన పెట్టగలరా? అలా చేస్తే భారీ నజరానా మీ సొంతం అయ్యే అవకాశం ఉంది. ఒకటి, రెండు కాదు…. ఏకంగా 72లక్షలు దక్కించుకోవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనివారు చాలా అరుదు. […]
స్మార్ట్ ఫోన్… ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. తిండి లేకుండా ఒకరోజు ఉంటారేమో కానీ…స్మార్ట్ ఫోన్ లేనిది నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. అంతేకాదు స్మార్ట్ ఫోన్ మన జీవితంలో భాగంగా మారింది. అయితే మీరు స్మార్ట్ ఫోన్‌ను ఒక ఏడాది కాలం పాటు పక్కన పెట్టగలరా? అలా చేస్తే భారీ నజరానా మీ సొంతం అయ్యే అవకాశం ఉంది. ఒకటి, రెండు కాదు…. ఏకంగా 72లక్షలు దక్కించుకోవచ్చు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనివారు చాలా అరుదు. పడుకునే సమయంలో… తినే సమయంలో ఇలా అన్ని వేళల్లో స్మార్ట్ ఫోన్ భాగమైంది. స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేని విధంగా మారిపోయింది. కానీ సంవత్సరంపాటు మీరు ఈ ఫోన్ కు దూరం ఉంటే ఈ బంపర్ ఆఫర్ మీరు గెలుచుకోవచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. కొకాకోలా కంపెనీకి చెందిన విటమిన్ వాటర్ ఈ ఆఫర్ ప్రకటించింది. విటమిన్ వాటర్ అమెరికాకు చెందిన కంపెనీ. ”స్క్రోల్ ఫ్రీ ఫర్ ఏ ఇయర్” పేరుతో ఈ పోటీని నిర్వహిస్తోంది.
ఈ పోటీలో పాల్గొనేవారు ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలి. 2019 జనవరి 8వ తేదీన ఎంట్రీకి చివరి తేదీ. విటమిన్ వాటర్ సంస్థకు చెందిన అధికారిక ట్విట్టర్ లేదా ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేకుండా సంవత్సరం పాటు ఎలా గడుపుతారనే విషయాన్ని హ్యాట్ ట్యాగ్ లతో పంపించాలి.
పోటీదారుడు ఇచ్చే సమాధానంపై కంపెనీ సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఎవరైతే…. కరెక్ట్ సమాధానాలు పంపిస్తారో వారిని సెలక్ట్ చేస్తారు. జనవరి 22వ తేదీలోపు సెలక్ట్ చేస్తారు. తర్వాత కాంట్రాక్టు పేపర్లపై సంతకం చేయిస్తారు. అయితే పోటీదారులు కేవలం స్మార్ట్ ఫోన్‌కు మాత్రమే దూరంగా ఉండాలి. కంప్యూటర్లను యథాతథంగా ఉపయోగించవచ్చు. ఇక మరో విషయం గుర్తుంచుకోండి. మేము స్మార్ట్ ఫోన్ వాడితే… వారికి తెలుస్తుందా అని అనుకోకండి. ఎందుకంటే చీట్ చేసినట్లయితే… లై డిటెక్టర్ ద్వారా పరీక్షలు జరిపే అవకాశం కూడా ఉంటుంది.
ఇదంతా విటమిన్ వాటర్ కంపెనీ ఉచిత పబ్లిసిటీ కోసం వేసిన మెగా ప్లాన్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పోటీలు పెట్టడం వల్ల డబ్బులు పెట్టి ప్రకటనలు ఇవ్వకుండానే ఈ విటమిన్ వాటర్ గురించి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిదాకా ఈ సమాచారం అందుతుంది. కొన్ని వేల కోట్లు ఖర్చుపెడితే గానీ లభించని ప్రచారం ఇలాంటి స్కీములతో ఉచితంగా లభిస్తుంది. గెలుపొందిన వ్యక్తికి 72 లక్షలు రావడం ఏమో గానీ ఆ ప్రొడక్ట్‌కు మాత్రం కొన్ని వందల కోట్ల రూపాయల ఉచిత ప్రచారం లభిస్తుంది. తెలివి తేటలు ఒకడి అబ్బసొత్తా అంటే ఇదేనేమో…!