భారత్‌కు మాల్యా తరలింపు.... అంగీకరించిన యూకే కోర్టు

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్‌ చెక్కేసిన విజయ మాల్యాకు షాక్ తగిలింది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించేందుకు లండన్‌ కోర్టు అంగీకరించింది. భారత్‌ విజ్ఞప్తిపై విచారణ జరిపిన కోర్టు మాల్యాను భారత్‌కు తీసుకెళ్లవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా లండన్‌లో తిరుగుతున్న విజయ్‌ మాల్యా అరెస్ట్ కాబోతున్నారు. అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు సీబీఐ ఏర్పాట్లు చేస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయ్‌ […]

Advertisement
Update:2018-12-10 12:37 IST

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్‌ చెక్కేసిన విజయ మాల్యాకు షాక్ తగిలింది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి.

విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించేందుకు లండన్‌ కోర్టు అంగీకరించింది. భారత్‌ విజ్ఞప్తిపై విచారణ జరిపిన కోర్టు మాల్యాను భారత్‌కు తీసుకెళ్లవచ్చని అనుమతి ఇచ్చింది.

దీంతో బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా లండన్‌లో తిరుగుతున్న విజయ్‌ మాల్యా అరెస్ట్ కాబోతున్నారు. అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు సీబీఐ ఏర్పాట్లు చేస్తోంది.

రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయ్‌ మాల్యా పలు బ్యాంకులను ముంచేసి హఠాత్తుగా విదేశాలకు చెక్కేశారు. దాంతో రాజ్యసభ నుంచి మాల్యాను బహిష్కరించారు. అతడు విదేశాలకు పారిపోవడానికి కొందరు పెద్దలు కూడా సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

లండన్‌లో దాక్కున్న తనను యూకే కోర్టు భారత్‌కు అప్పగించేందుకు అంగీకరిస్తుందని ముందే గ్రహించిన విజయ్‌ మాల్యా కొద్దిరోజులుగా కొత్త పల్లవి అందుకున్నారు. వడ్డీ లేకుండా అసలు మొత్తం చెల్లిస్తానని అందుకు అంగీకరించాలంటూ బ్యాంకులకు లేఖలు కూడా రాశారు.

కానీ అందుకు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా మౌనంగా ఉన్నాయి. దీనిపైనా ఇటీవల మాల్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను డబ్బులు చెల్లిస్తానంటుంటే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఇంతలోనే యూకే కోర్టు మాల్యాను భారత్‌కు తీసుకెళ్లవచ్చని అనుమతి ఇవ్వడంతో లిక్కర్‌ డాన్ స్వదేశానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Tags:    
Advertisement

Similar News