వ్యక్తుల డేటాను అవసరానికి మించి సేకరిస్తున్న ఇండియన్ యాప్స్....!

ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వాడకం గణనీయం పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోల్చి చూసినట్లయితే…ఇండియాలోనే అధికంగా మొబైల్ డేటాను వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే… కేవలం ఇండియాలోనే దాదాపు 40శాతం అధికంగా మొబైల్ డేటాను యాప్స్ మింగేస్తున్నాయి. ఎస్ఎంఎస్ లకు యాక్సెస్, మైక్రోఫోన్, కాంటాక్ట్ బుక్ ల పరంగా చూసినట్లయితే… ఇతర దేశాల కంటే ఎక్కువ ఇండియన్ యాప్స్ ద్వారానే యాక్సెస్ చేయబడ్డాయి. ఎంటర్ ప్రైస్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ ప్లాట్ ఫాం, ఆర్కా కన్సల్టింగ్ రూపొందించిన […]

Advertisement
Update:2018-12-08 07:39 IST

ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వాడకం గణనీయం పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోల్చి చూసినట్లయితే…ఇండియాలోనే అధికంగా మొబైల్ డేటాను వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే… కేవలం ఇండియాలోనే దాదాపు 40శాతం అధికంగా మొబైల్ డేటాను యాప్స్ మింగేస్తున్నాయి. ఎస్ఎంఎస్ లకు యాక్సెస్, మైక్రోఫోన్, కాంటాక్ట్ బుక్ ల పరంగా చూసినట్లయితే… ఇతర దేశాల కంటే ఎక్కువ ఇండియన్ యాప్స్ ద్వారానే యాక్సెస్ చేయబడ్డాయి.

ఎంటర్ ప్రైస్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ ప్లాట్ ఫాం, ఆర్కా కన్సల్టింగ్ రూపొందించిన వార్షిక ఆధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. యాప్స్ కోర్ యాక్టివిటికి అవసరమైన అనుమతుల్లో థర్డ్ పార్టీ అవసరం లేదు. కానీ ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్ కోసం అత్యధికంగా డేటాను వినియోగిస్తున్నట్లు వార్షిక అధ్యయనంలో వెల్లడైంది.

సుమారు 50 ప్రపంచ ఆండ్రాయిడ్ యాప్స్ ప్రైవసీ, సాంకేతికతకు సంబంధించి గోప్యతను పాటిస్తున్నట్లు అంచనా వేశారు. ట్రావెలింగ్, షాపింగ్, వాలెట్స్ కు సంబంధించిన యాప్స్…ప్రపంచ దేశాలకంటే ఇండియాలోనే 1.5 నుంచి 3రెట్లు ఎక్కువగా డేటాను ఉపయోగిస్తున్నాయి.

రోజు రోజుకు పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం…. వీటికి తోడు తక్కువ ధరకే ఎక్కువ డేటా ఆఫర్లు. వీటితో ఇంటర్నెట్ కంపెనీలు తమ ఫ్లాట్ ఫాంలను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. యూజర్లకు సంబంధించిన షాపింగ్, బ్యాంక్ లావాదేవీలు, సర్వీసు హోస్ట్లకు ఉపయోగం గురించి వారి నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ యాప్స్ థర్డ్ పార్టీ వెండర్స్ లక్ష్యంగా అమ్ముడవుతున్న యూజర్ల ప్రొఫైళ్ళను రూపొందించడానికి సహాయపడతాయి. ఒక యూజర్ యాప్ ఇన్ స్టాల్ చేసినప్పుడు సగటున ఇండియన్ యాప్స్ 8 పర్మిషన్స్ తీసుకుంటాయి.

ఇక ఫేస్ బుక్ వంటి గ్లోబల్ సాంకేతిక సంస్థలు కస్టమర్ డేటాను తప్పుదారి పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసేటప్పుడు డేటాను షేర్ చేసుకోవడానికి యూజర్లను అనుమతించేందుకు కొత్త పద్దతిని తీసుకువచ్చినట్లు గూగుల్ ప్రకటించింది.

ప్రకటనలు, విశ్లేషణల కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ థర్డ్ పార్టీలకు 99శాతం డేటాను అందిస్తుంది. సగటున చూసినట్లయితే ఒక యాప్ లేదా వెబ్ సైట్ ఐదు పార్టీల కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. గూగుల్ 30శాతం నుంచి 58శాతం, ఫేస్ బుక్ డేటా వినియోగంలో రెండవ స్థానంలోఉన్నట్లు నివేదిక పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News