వాట్సాప్ లోకి మరో రెండు సరికొత్త ఫీచర్లు! అవేవంటే....
పాపులర్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్…తన యూజర్లకు మరో రెండు సరికొత్త ఫీచర్లను అందించనుంది. కాన్ సెక్యుటీవ్ వాయిస్ మెసేజ్, గ్రూప్ కాల్ కోసం షార్ట్ కట్ ఫీచర్లు వంటివి యూజర్లను అట్రాక్ట్ చేయనున్నాయి. కాన్ సెక్యూటివ్ వాయిస్ మెసేజెస్ ఫీచర్ సహయంతో యూజర్లు తమ వాట్సప్ కు వచ్చే వాయిస్ మెసేజ్ లను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్లే చేసుకునే సదుపాయం ఉంటుంది. అంతేకాదు గ్రూప్ కాల్స్ ను కూడా మరింత సౌకర్యవంతంగా […]
పాపులర్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్…తన యూజర్లకు మరో రెండు సరికొత్త ఫీచర్లను అందించనుంది. కాన్ సెక్యుటీవ్ వాయిస్ మెసేజ్, గ్రూప్ కాల్ కోసం షార్ట్ కట్ ఫీచర్లు వంటివి యూజర్లను అట్రాక్ట్ చేయనున్నాయి. కాన్ సెక్యూటివ్ వాయిస్ మెసేజెస్ ఫీచర్ సహయంతో యూజర్లు తమ వాట్సప్ కు వచ్చే వాయిస్ మెసేజ్ లను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్లే చేసుకునే సదుపాయం ఉంటుంది.
అంతేకాదు గ్రూప్ కాల్స్ ను కూడా మరింత సౌకర్యవంతంగా చేసుకునేందుకు వాట్సాప్ లో గ్రూప్ కాల్ షార్ట్ కట్ బటన్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్లలో ఈ రెండు ఫీచర్లు వాట్సాప్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఈ ఫీచర్లు త్వరలోనే లభ్యం కానున్నాయి.
వాట్సప్ బీటా వర్షన్ 2.18.362లో ఈ ఫీచర్ ఉంది. దీంతో యూజర్లకు వాయిస్ మెసేజ్‌లు ఒకదాని తర్వాత ఒకటి ఆటోమెటిక్‌గా ప్లే అవుతాయి. రెండు కంటే ఎక్కువ వాయిస్ మెసేజ్‌లు వరుసగా ఉంటే మొదటి ఆడియోను ప్లే చేస్తే చాలు మిగతావన్నీ ఆటోమెటిక్‌గా ప్లే అవుతాయి.
ఇప్పుడు ఒక్కో ఆడియో ఫైల్‌ను మ్యాన్యువల్‌గా ప్లే చేసుకోవల్సి వచ్చేది. వీటితోపాటు గ్రూప్ కాలింగ్ ఫీచర్లో వాట్సాప్ చిన్న మార్పును కూడా చేయబోతోంది. గ్రూప్ చాటింగ్ లో కనిపించే కాలింగ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఆ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికీ కాల్ వెళ్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి అందరికీ కాల్ కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.