గోషామహల్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు....?

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆసక్తికరంగా మారిన నియోజక వర్గాల్లో గోషామహల్ ఒకటి. హిందుత్వమే ఎజెండాగా బరిలోకి దిగుతున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకవైపు…. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి కూడా చేపట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ మరో వైపు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న గోషామహల్ నియోజకవర్గంపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుగన్న రాజాసింగ్ గెలుపు ఈ సారి కేవలం హిందుత్వ, బీజేపీ అభిమానుల ఓట్ల ఫలితంగానే రానుంది. ఈ […]

Advertisement
Update:2018-12-03 03:00 IST

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆసక్తికరంగా మారిన నియోజక వర్గాల్లో గోషామహల్ ఒకటి. హిందుత్వమే ఎజెండాగా బరిలోకి దిగుతున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకవైపు…. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి కూడా చేపట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ మరో వైపు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న గోషామహల్ నియోజకవర్గంపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుగన్న రాజాసింగ్ గెలుపు ఈ సారి కేవలం హిందుత్వ, బీజేపీ అభిమానుల ఓట్ల ఫలితంగానే రానుంది. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకత, మోడీ పాలన వంటి అంశాల ప్రభావం తక్కువే. ఈ నియోజకవర్గంలో పోరు పూర్తిగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

ఓల్డ్ సిటీలోని నియోజకవర్గాల్లో అత్యధిక హిందూ ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇదే. దీంతో ఇక్కడ ఎంఐఎం గెలిచే పరిస్థితి అంతంత మాత్రమే. అయితే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చి.. కొద్దిపాటిగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే బదులు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ గౌడ్‌కు పరోక్ష మద్దతు ఇస్తే.. రాజాసింగ్‌ను ఓడించవచ్చని ఎంఐఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితిలోనూ బీజేపీ గెలవకూడదనే నిశ్చయంతో ఎంఐఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రాజాసింగ్ తనకు సాంప్రదాయంగా ఉన్న హిందూ ఓట్లతో పాటు.. తటస్థ ఓటర్లను తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులతో పాటు.. స్వామీ పరిపూర్ణానందతో కూడా తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌ నియోజకవర్గంలో రాజాసింగ్ వ్యతిరేక ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎంఐఎం సహకరిస్తే భారీగా ముస్లిం ఓటర్లను కూడా తనవైపు తిప్పుకుంటే విజయం సునాయాసంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎంఐఎం పరోక్ష మద్దకు కూడా కలిస్తే ముఖేష్ గౌడ్ విజయం ఖాయమే.

Tags:    
Advertisement

Similar News