కేసీఆర్ మనవడ్ని ఎందుకు తిట్టానంటే....
రేవంత్ రెడ్డి సుద్దపూస అయిపోయాడు…. కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టిన తన బూతుల పర్వంపై విమర్శలు చెలరేగిన వేళ వివరణ ఇచ్చాడు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తిడితే తప్పులేదని… తాము తిడితేనే తప్పు వచ్చిందా? అని సుతిమెత్తగా రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను వల్లెవేశారు. తెలంగాణ ను ఇచ్చిన తల్లిలాంటి సోనియాను అమ్మనా బొమ్మనా అని కేటీఆర్ అనడం […]
రేవంత్ రెడ్డి సుద్దపూస అయిపోయాడు…. కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టిన తన బూతుల పర్వంపై విమర్శలు చెలరేగిన వేళ వివరణ ఇచ్చాడు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తిడితే తప్పులేదని… తాము తిడితేనే తప్పు వచ్చిందా? అని సుతిమెత్తగా రేవంత్ ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను వల్లెవేశారు. తెలంగాణ ను ఇచ్చిన తల్లిలాంటి సోనియాను అమ్మనా బొమ్మనా అని కేటీఆర్ అనడం న్యాయమేనా అని రేవంత్ ప్రశ్నించారు.
గడ్డాలు పెంచుకుంటే అధికారం రాదని.. సన్యాసులవుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేటీఆర్ అనడం సమంజసమా అని ప్రశ్నించారు.
అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ను పట్టుకొని ఓ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ‘బఫూన్’ అనడం ఎంత దారుణమని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ కూతురు కవిత తనను గుంటనక్క అని విమర్శించడం కరక్టేనా అని రేవంత్ ప్రశ్నించారు.
ఇక తన కొడుకును రేవంత్ తిట్టినందుకు రాజకీయాలని వదిలేయాలని అనిపించిందని అన్న కేటీఆర్ ఆవేదనపై రేవంత్ పలు ప్రశ్నలు సంధించారు. బడికి వెళ్లే కేసీఆర్ మనవడు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు, సచివాలయానికి ఎందుకు వెళ్లి అధికారికంగా పాల్గొంటాడని రేవంత్ ప్రశ్నించాడు. భద్రాద్రి రామయ్యకు కేసీఆర్ స్థానంలో ఆయన మనవడు బడికి వెళ్లే విద్యార్థి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించడం ఏంటని ప్రశ్నించారు.
అధికారిక పండగల్లో కేసీఆర్ పక్కన ఎలాంటి హోదా, అధికారం లేని స్కూలు పిల్లగాడు హిమాన్షు పాల్గొనడం పైనే తాను ప్రశ్నించానని రేవంత్ అన్నారు. కేసీఆర్ సచివాలయానికి రారు కానీ…. ఆయన మనవడు సచివాలయంలో గోటీలు ఆడుతాడని రేవంత్ ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే తాను కేటీఆర్ కొడుకుపై విమర్శలు చేశానని రేవంత్ వివరణ ఇచ్చారు.
నా కూతురు నిశ్చితార్థానికి నేను హాజరు కాకుండా కేసీఆర్ సర్కారు ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇవ్వకుండా కుట్ర చేసిందని…. దాని మీద ఎందుకు మాట్లాడరని రేవంత్ ప్రశ్నించారు. తమ ఫ్యామిలీని టార్గెట్ చేసిన కేసీఆర్ కుటుంబంపై తాను విమర్శలు చేస్తే తప్పు వచ్చిందా అని రేవంత్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రేవంత్ పరిపాలన, విద్య, వైద్యం, రైతులకు గిట్టుబాటు ధరలపై మాట్లాడారు. ఇందుకోసం పలు విప్లవాత్మక మార్పులను ఆయన సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనపై మాట్లాడారు. పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఖాళీలను జూన్ 2న భర్తీ చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేషన్ డీలర్ల వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. స్వయం పాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తామని అన్నారు.