లోకేష్ కోసం హైవే బ్లాక్.... అంబులెన్స్‌కు దారి నిరాకరణ

ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ పల్నాడు ప్రాంత పర్యటన వాహనదారులకు నరకం చూపించింది. లోకేష్ కోసం ఏకంగా హైవేపైనే వాహనాలను నిలిపేశారు. అంబులెన్స్‌లకు కూడా అనుమతి నిరాకరించారు. గురజాల నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో లోకేష్ పర్యటించారు. దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాల్లో బహిరంగ సభలు మగిసే వరకు దాదాపు ఐదు గంటల పాటు అద్దంకి- నార్కెట్‌పల్లి హైవేపై వాహనాలను నిలిపివేశారు. సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలన్నీ రోడ్డుపై ఆగిపోయాయి. మాచవరం […]

Advertisement
Update:2018-11-24 02:46 IST

ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ పల్నాడు ప్రాంత పర్యటన వాహనదారులకు నరకం చూపించింది. లోకేష్ కోసం ఏకంగా హైవేపైనే వాహనాలను నిలిపేశారు.

అంబులెన్స్‌లకు కూడా అనుమతి నిరాకరించారు. గురజాల నియోజకవర్గంలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో లోకేష్ పర్యటించారు. దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాల్లో బహిరంగ సభలు మగిసే వరకు దాదాపు ఐదు గంటల పాటు అద్దంకి- నార్కెట్‌పల్లి హైవేపై వాహనాలను నిలిపివేశారు. సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలన్నీ రోడ్డుపై ఆగిపోయాయి.

మాచవరం మండలానికి చెందిన ఒక గర్భిణి కాన్పు కోసం నరసరావుపేటకు అంబులెన్స్‌లో వెళ్తుండగా… పిడుగురాళ్లకు సమీపంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది.

సుమారు రెండు గంటల పాటు ఆమె నొప్పులతో అల్లాడుతూ అంబులెన్స్‌లోనే ఉండిపోయారు. ఆమె పరిస్థితిని చూడలేక బంధువులు, ఇతర వాహనదారులు … దారి ఇవ్వాల్సిందిగా వేడుకున్నా పోలీసులు సహకరించలేదు. దీంతో ఆమె లోకేష్ వెళ్లే వరకు అంబులెన్స్‌లోనే రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది.

లోకేష్ మీటింగ్‌ జరుగుతోంది కాబట్టి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్ కోసం హైవేను బ్లాక్‌ చేయడంపై వాహనదారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి మీటింగ్ ఉందని హైవేలపై వాహనాలను ఆపడం ఎప్పుడూ చూడలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News