గెలిచే సీట్లపైనే గులాబీ బాస్ గురి !
ముందస్తు ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం పూర్తయింది. రెండు రోజుల్లో పోటీలో ఉండేది ఎవరు? రెబెల్స్ ఎవరు? అలాగే బేరసారాలు విషయం తేలిపోతుంది. అయితే మలివిడత ప్రచారానికి గులాబీ బాస్ శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్,నల్గొండ,వనపర్తి, నిజామాబాద్ జిల్లాలో జరిగిన సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. మలివిడత ప్రచారంలో ఆరు రోజుల్లో కేసీఆర్ 31 సభల్లో పాల్గొంటారు. టీఆర్ఎస్‌కి కీలకమైన ఈ 31 నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రధానంగా దృష్టిపెట్టారు. […]
ముందస్తు ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం పూర్తయింది. రెండు రోజుల్లో పోటీలో ఉండేది ఎవరు? రెబెల్స్ ఎవరు? అలాగే బేరసారాలు విషయం తేలిపోతుంది. అయితే మలివిడత ప్రచారానికి గులాబీ బాస్ శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్,నల్గొండ,వనపర్తి, నిజామాబాద్ జిల్లాలో జరిగిన సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు.
మలివిడత ప్రచారంలో ఆరు రోజుల్లో కేసీఆర్ 31 సభల్లో పాల్గొంటారు. టీఆర్ఎస్‌కి కీలకమైన ఈ 31 నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈవిడత తిరిగే ఈ నియోజకవర్గాలలో తెలంగాణ రాష్ట్రసమితి తప్పనిసరిగా గెలుస్తుందని అంచనాతో ఉన్నారు. అందుకే పెద్దగా పోటీ లేని… తాము గెలుస్తామని అనుకునే నియోజక వర్గాల్లో తొలి విడత ప్రచారం మొదలుపెట్టారు.
119 నియోజకవర్గాలను మూడు గ్రేడులుగా విభజించారు. టీఆర్ఎస్ కొంత ప్రచారం చేసి… కొంచెం వ్యూహాత్మకంగా వెళ్లే నియోజకవర్గాలను ఏ గ్రేడ్‌లుగా విభజించారు. ఈ ఏ గ్రేడ్‌లో ఖమ్మం, పాలేరు, సిద్ధిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డి, జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్, ఖానాపూర్, బోథ్, నిర్మల్,ముథోల్, ఆర్మూర్, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ, తాండూరు, పరిగి, నారాయణ పేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు ఉన్నాయి.
అయితే రెండోకేటగిరిలో కష్టపడితే గెలిచే సీట్లు 35 నుంచి 45 వరకు చేర్చారు. 25 తర్వాత జరిగే సభల్లో ఈ నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఈ నియోజకవర్గాలలో కేసీఆర్ కీలకమైన సభలు ఏర్పాటు చేస్తారు. ఎన్నికల ముందు సీను మార్చే దమ్ము కేసీఆర్‌కు మాత్రమే ఉందని…. అందుకే ఎన్నికలకు కొద్ది ముందు ఇక్కడ సభలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీ కేటగిరిలో ఉన్న నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం చేసే వీలు లేదని తెలుస్తోంది.
అయితే ఈ కేటగిరీలను కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఏ కేటగిరి సీట్లలో ఇప్పుడు కొన్ని పోటాపోటీగా మారినట్లు కొందరి అంచనా. మంత్రుల నియోజకవర్గాలను ప్రధానంగా ఏ కేటగరీలో పెట్టారని…. కానీ రానురాను పరిస్థితిలో మార్పులు కన్పిస్తున్నాయని చెబుతున్నారు.