జనగామపై కోదండరాం రాజీ పడ్డారా..? అసలు విషయం ఏంటి..?

తెలంగాణ ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకుంది. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. మహాకూటమిగా ఏర్పడిన పార్టీల సమన్వయ లోపంతో చాలా నియోజకవర్గాల్లో రెబర్స్ తయారయ్యారు. మరీ ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయం అదరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. జనగామ జిల్లా సాధన కోసం జరిగిన పోరాటాలకు కోదండరాం […]

Advertisement
Update:2018-11-16 11:27 IST

తెలంగాణ ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకుంది. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. మహాకూటమిగా ఏర్పడిన పార్టీల సమన్వయ లోపంతో చాలా నియోజకవర్గాల్లో రెబర్స్ తయారయ్యారు. మరీ ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయం అదరి దృష్టిని ఆకర్షిస్తోంది.

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. జనగామ జిల్లా సాధన కోసం జరిగిన పోరాటాలకు కోదండరాం మద్దతు ఇచ్చారు. ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ప్రొఫెసర్ సాబ్ డిసైడ్ అయ్యారు. అయితే మహాకూటమి నేపథ్యంలో సీట్ల సర్థబాటు పార్టీలకు క్లిష్టంగా మారింది.

మరోవైపు ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ సీటునే కోరకుంటున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ కార్యకర్తల వద్ద కూడా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి రెండు జాబితాల్లో జనగామ అభ్యర్థి పేరు లేదు. టీజేఎస్ కూడా ఈ సీలు తమకే కావాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.

గత రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లక్ష్మయ్య జనగామ టికెట్ కోసం అధిష్టానం పెద్దలతో చర్చిస్తున్నారు. నిన్న జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో రాహుల్ గాంధీని కూడా కలిశారు. తనకు రేపు అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరగా.. మీ సమస్య ఏంటో ఇక్కడ చెప్పండి నేను ఇక్కడే తీరుస్తానన్నారని సమాచారం. అయితే లక్ష్మయ్య కోరుకుంటున్న జనగామ విషయం చెప్పగా.. ఈ విషయం మీరు కోదండరాంతోనే మాట్లాడుకోమని రాహుల్ లక్ష్మయ్య ముఖం మీదే చెప్పినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

ఇక ఇవాళ ఢిల్లీలో కోదండరాం, లక్ష్మయ్య సుదీర్ఘంగా చర్చించుకొని జనగామ టికెట్ వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే తమ సిద్దాంతాలను పాటించి ఈ సీటు పొన్నాలకు వదిలేస్తున్నట్లు కోదండరాం చెప్పారు.

Tags:    
Advertisement

Similar News