పబ్లిక్‌ ప్లేస్‌లో... అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి గానా బజానా

నిషేధిత ప్రాంతంలో అర్దరాత్రి టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు అశ్లీల నృత్యాలలో చిందేశారు. పుట్టిన రోజు నాడు తన స్నేహితులను పిలిపించి వారికి విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. బాగా పొద్దుపోయాక బీచ్‌ వైపు ఎవరినీ పోలీసులు అనుమతించరు. రాత్రి ఎవరైనా బీచ్‌ వద్ద కనిపిస్తే తీసుకెళ్లి స్టేషన్‌లో కూర్చోబెడుతుంటారు. అలాంటిది కాకినాడ బీచ్ వద్ద హరితా రిసార్ట్స్‌కు సమీపంలో స్నేహితులతో కలిసి గానా బజానా చేశాడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు పిల్లి కృష్ణప్రసాద్. […]

Advertisement
Update:2018-11-15 06:02 IST

నిషేధిత ప్రాంతంలో అర్దరాత్రి టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు అశ్లీల నృత్యాలలో చిందేశారు. పుట్టిన రోజు నాడు తన స్నేహితులను పిలిపించి వారికి విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు.

బాగా పొద్దుపోయాక బీచ్‌ వైపు ఎవరినీ పోలీసులు అనుమతించరు. రాత్రి ఎవరైనా బీచ్‌ వద్ద కనిపిస్తే తీసుకెళ్లి స్టేషన్‌లో కూర్చోబెడుతుంటారు.

అలాంటిది కాకినాడ బీచ్ వద్ద హరితా రిసార్ట్స్‌కు సమీపంలో స్నేహితులతో కలిసి గానా బజానా చేశాడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు పిల్లి కృష్ణప్రసాద్. అర్థరాత్రి దాటినా కేకలు వేస్తూ, అశ్లీల నృత్యాలు చేయిస్తూ ఎమ్మెల్యే కుమారుడు, అతడి స్నేహితులు రచ్చ చేశారు.

కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పుట్టిన రోజు వేడుక అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడిది కావడంతో పోలీసులు స్పందించలేదు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

స్థానిక ఎస్‌ఐ మాత్రం ఎమ్మెల్యే కుమారుడు కృష్ణ ప్రసాద్ పుట్టిన రోజు వేడుకల అంశం తమ దృష్టికి వచ్చిందని… వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి వారికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News