డ్రైవర్ లేకుండా రైలు ప్రయాణం... తర్వాత ఏం జరిగిందంటే?

డ్రైవర్ లేకుండా రైలు ప్రయాణం చేసింది. అది కూడా 110 కిలో మీటర్ల వేగంతో గంట సేపు. ఎదురుగా మరో రైలు రాకపోవడం, గుడ్స్ రైలు కావడంతో ప్రాణాపాయం ఏమీ జరగలేదు. అతి కష్టం మీద అధికారులు నియంత్రించగలిగారు. అస్ట్రేలియాలోని పిబారా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. భారీగా ఇనుప ఖనిజంతో అస్ట్రేలియాలోని న్యూమన్ నుంచి పోర్ట్ హెడ్ ల్యాండ్ కు గుడ్స్ రైలు బయలు దేరింది. మొత్తం 268 వ్యాగన్లు ఉన్నాయి. నాలుగు […]

Advertisement
Update:2018-11-08 11:44 IST

డ్రైవర్ లేకుండా రైలు ప్రయాణం చేసింది. అది కూడా 110 కిలో మీటర్ల వేగంతో గంట సేపు. ఎదురుగా మరో రైలు రాకపోవడం, గుడ్స్ రైలు కావడంతో ప్రాణాపాయం ఏమీ జరగలేదు. అతి కష్టం మీద అధికారులు నియంత్రించగలిగారు. అస్ట్రేలియాలోని పిబారా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది.

భారీగా ఇనుప ఖనిజంతో అస్ట్రేలియాలోని న్యూమన్ నుంచి పోర్ట్ హెడ్ ల్యాండ్ కు గుడ్స్ రైలు బయలు దేరింది. మొత్తం 268 వ్యాగన్లు ఉన్నాయి. నాలుగు ఇంజన్లు తగిలించారు. రైలు పొడవు దాదాపు మూడు కిలోమీటర్లు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో పోర్ట్ ల్యాండ్ కు ఇంకా 210 కిలో మీటర్ల దూరంలో ఉన్న సమయంలో, రైలులోని ఓ భోగి వద్ద సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించి నిలిపివేశాడు. ఇంజన్ ఆన్ లో ఉండగానే, డ్రైవర్ కిందకు దిగి సదరు భోగిని పరిశీలిస్తుండగా ట్రైన్ ముందుకు కదిలింది.

దాదాపు 110 కిలో మీటర్ల వేగంతో సుమారు గంటన్నర పాటు ముందుకెళ్లి పట్టాలు తప్పింది. అధికారులు అతికష్టం మీద 6.10 గంటల సమయంలో నియంత్రణలోకి తీసుకురాగలిగారు. అప్పటికే కొన్ని భోగీలు పట్టాలు తప్పి భారీగా నష్టం వాటిల్లింది. ఇనుప ఖనిజం మొత్తం నేలపై పడిపోయింది. సుమారు 15 కిలో మీటర్ల మేర ట్రాక్ దెబ్బతింది.

ఈ కారణంగా మిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లు అస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం బీహెచ్ పీ అంచనా వేసింది. రైలు ట్రాక్ పునర్ నిర్మించేందుకు మూడు నాలుగు రోజులు పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.

Tags:    
Advertisement

Similar News