చెప్పుడు మాటలు విన్నా.... కెరియర్ నాశనం చేసుకున్నా
చెప్పుడు మాటలు వినకండి. ఆ మాటలే మన జీవితాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలు ఊరికే అనలేదు. అలా పెద్దలు చెప్పిన మాట వినని స్టార్ క్రికెటర్ తప్పు చేశానని కుమిలిపోతున్నాడు. తన తోటి టీం మేట్స్ చెప్పిన చెప్పుడు మాటలు వినకపోయినా బాగుండేందని అంటున్నాడు. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా..? ఆండ్రూ సైమండ్స్. తన బ్యాటింగ్ తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించిన ఆండ్రూ ఆస్ట్రేలియా క్రికెట్ […]
చెప్పుడు మాటలు వినకండి. ఆ మాటలే మన జీవితాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలు ఊరికే అనలేదు. అలా పెద్దలు చెప్పిన మాట వినని స్టార్ క్రికెటర్ తప్పు చేశానని కుమిలిపోతున్నాడు. తన తోటి టీం మేట్స్ చెప్పిన చెప్పుడు మాటలు వినకపోయినా బాగుండేందని అంటున్నాడు.
ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా..? ఆండ్రూ సైమండ్స్. తన బ్యాటింగ్ తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించిన ఆండ్రూ ఆస్ట్రేలియా క్రికెట్ టీం విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అప్పటివరకు దిగ్విజయంగా కొనసాగిన క్రికెటర్ జైత్రయాత్ర 2008లో జరిగిన సిడ్నీ టెస్ట్ తో ముగిసింది.
అప్పటి నుండి ఆండ్రూ జీవితం తలకిందులైంది. మద్యానికి బానిసై క్రికెట్ కెరియర్ నుంచి వైదొలిగాడు. దీనంతటికి కారణం…. ”మంకీ గేట్” వివాదంలో తన టీం మెట్స్ చెప్పుడు మాటలు వినడమే.
ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రత్యర్ధుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి దూషించడం, కామెంట్స్ చేయడం లాంటివి చేస్తుంటారు. దాన్ని ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా అలవాటు చేసుకున్నాడు.
2008లో సిడ్నీ టెస్ట్ సందర్భంగా హర్భజన్ సింగ్ – సైమండ్స్ ను మంకి అని సంబోధించాడు. ఆ మాటలతో సైమండ్స్ అవమానకరంగా ఫీలయ్యాడు. దీంతో సైమండ్స్ – ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆసిస్ క్రికెట్ బోర్డ్ కు బజ్జీపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు తనను ఉద్దేశించి వర్ణ వివక్షతా పూర్వక వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తడంతో బజ్జీపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అందుకు నిరసనగా భారత బృందం ఆస్ట్రేలియా టూర్ ను క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ దిగొచ్చింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య వరుస మ్యాచ్ లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే తన టీం మేట్స్ చెప్పిన చెప్పుడు మాటలు విని క్రికెట్ ను దూరం చేసుకున్నానని ఓ మీడియా సమావేశంలో చెప్పాడు. ”మంకీగేట్” వివాదంతోనే నా కెరీర్ పతనమైంది. ఒత్తిడిని తట్టుకోలేక మద్యానికి పూర్తిగా అలవాటు పడిపోయాను. నా టీమ్‌మేట్సే ఈ రొంపిలోకి లాగారు. వివాదాన్ని రేపడానికి కారణమయ్యారు. ఇష్యూ పెద్దగా అయిన తర్వాత ఇలా చేసి తప్పు చేశావని నిందించారు. అప్పుడే ఈ ఇష్యూకు నేను రియాక్ట్ అయిన విధానం తప్పని అర్థమైంది అంటూ తన మనసులోని బాధను వెళ్లగక్కాడు.