అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్....

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ వలస దారులకు కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట.. దీనిపై ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వస్తుండడం అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం అమెరికాలో జన్మించే చిన్నారులు ఎవరికైనా పౌరసత్వ హక్కు లభిస్తుంది. చిన్నారి తల్లిదండ్రులు ఏ దేశం వారైనా సరే అమెరికాలో పిల్లలుగా పుడితే వారు అమెరికన్ సిటిజన్ అయిపోతారు. దీంతో చాలా మంది వలసదారులు ఇదే […]

Advertisement
Update:2018-10-31 07:38 IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ వలస దారులకు కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట.. దీనిపై ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వస్తుండడం అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం అమెరికాలో జన్మించే చిన్నారులు ఎవరికైనా పౌరసత్వ హక్కు లభిస్తుంది. చిన్నారి తల్లిదండ్రులు ఏ దేశం వారైనా సరే అమెరికాలో పిల్లలుగా పుడితే వారు అమెరికన్ సిటిజన్ అయిపోతారు. దీంతో చాలా మంది వలసదారులు ఇదే ప్లాన్ అప్లయి చేస్తూ అమెరికన్ పౌరసత్వం పొందుతున్నారట.

దీనివల్ల నిజమైన అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. తాజాగా బుధవారం ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వేరే దేశం నుంచి వచ్చి బిడ్డను కంటే ఆ చిన్నారికి అమెరికా పౌరసత్వం దానంతట అదే వస్తోంది. అమెరికా పౌరులకుండే సకల ప్రయోజనాలు 85 ఏళ్ల పాటు ఆ చిన్నారి పొందుతోంది. ఈ పద్ధతికి చరమగీతం పాడాలనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారికంగా ఆర్డర్ కూడా ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నానని ప్రకటించారు.

అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రేయాన్ దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పౌరసత్వ హక్కును ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో తొలగించలేరని ఆయన స్పష్టం చేశారు. తమకు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని పౌల్ తెలిపారు. దీంతో వలస దారుల బిడ్డలకు అమెరికా పౌరసత్వం దక్కకుండా చేయాలనుకున్న ట్రంప్ కు గట్టి షాక్ తగిలినట్లయింది.

Tags:    
Advertisement

Similar News