లోకేష్‌కు కొడాలి నాని కౌంటర్ అదిరింది!

జగన్ పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ స్పందించిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ట్విటర్లో చెలరేగిపోయి బురద జల్లిన లోకేష్ కు గాలి తీసేసేలా కౌంటర్లు ఇచ్చాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని. నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేక, నాన్నారు నామినేట్ చేస్తే MLCగా మంత్రి అయిన నువ్వు గెలుపు-ఓటముల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అధికారంకోసం పొత్తులు,అవసరం తీరాక […]

Advertisement
Update:2018-10-28 06:40 IST

జగన్ పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ స్పందించిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ట్విటర్లో చెలరేగిపోయి బురద జల్లిన లోకేష్ కు గాలి తీసేసేలా కౌంటర్లు ఇచ్చాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.

రాజకీయాల్లో గెలుపు ఓటముల గురించి లోకేష్ మాట్లాడటం అంటే అంతకు మించిన ప్రహసనం లేదని కొడాలి నాని వేసిన కౌంటర్ హైలైట్ అని చెప్పాలి.

‘‘నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేక, నాన్నారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే మంత్రి అయిన నువ్వు గెలుపు-ఓటముల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అధికారం కోసం పొత్తులు,అవసరం తీరాక నిందలు వేయటం మీకు ఏమాత్రం కొత్తకాదు. రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్య పెట్టొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం..’’ అంటూ ఒక ట్వీట్లో కొడాలి నాని లోకేష్ కు చురక అంటించాడు.

ఎలాగూ ఓటమి తప్పదు అంటూ జగన్ ఈ హత్యాయత్నం చేయించుకున్నాడని లోకేష్ ముందుగా ట్వీట్ చేశాడు. దీనికి కొడాలి నాని చాలా కరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. నామినేటెడ్ పదవితో మంత్రి పదవిని పొందిన నువ్వా గెలుపు ఓటముల గురించి మాట్లాడేది? అంటూ ట్వీట్ పేల్చాడు. దీనికి లోకేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

‘‘అధికారం కోసం ఎలాంటి నీచమైన పనులు అయినా చేయవచ్చు అని పోటీ పెడితే మీ బాబుని కొట్టే వాడు ప్రపంచంలోనే ఎవడూ లేడు. వెన్నుపోటుకి పర్యాయపదం నీ బాబు. 40 ఏళ్ల చరిత్ర. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమకంతా పచ్చ గానే కనిపిస్తుందిరా లోకేశా…’’అంటూ మరో ట్వీట్ తో లోకేష్ కు పంచ్ ఇచ్చాడు కొడాలి నాని.

‘‘ఆశ్చరం కాదురా లోకేశా.. ఆశ్చర్యం అనాలి.. ఈ పకోడీ ట్వీట్లు వేయడం మానేసి వెళ్లి తెలుగు నేర్చుకో…#ShamelessTdP’’ అంటూ కొడాలి నాని లోకేష్ కు వరస ట్వీట్లతో ఝలక్ ఇచ్చాడు. ఈ ట్వీట్లపై లోకేష్ మళ్లీ స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News