కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ప్రపంచానికి అందించిన అలెన్ మృతి
ఈరోజున ప్రతి ఒక్కళ్ళ దగ్గర కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయంటే అందుకు కారణం పాల్ అలెన్. ఈయన, బిల్‌గేట్స్ బాల్య స్నేహితులు. 1970ల్లో మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా ఎన్నో అద్భుత ఉత్పత్తులను ప్రపంచానికి అందజేశారు. ప్రపంచంలో సాంకేతిక విప్లవానికి కారకులయ్యారు. పాల్ అలెన్ (65) చొరవతో అనేక పరిశోధనా సంస్థలను స్థాపించారు. సాంకేతిక, వైద్య పరిశోధనలను ప్రోత్సహించారు. పాల్ అలెన్ అనేక సేవా సంస్థలకు పెద్దమొత్తంలో ఆర్ధిక సహాయం చేశాడు. మైక్రోసాప్ట్‌తో పాటు అనేక […]
ఈరోజున ప్రతి ఒక్కళ్ళ దగ్గర కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయంటే అందుకు కారణం పాల్ అలెన్. ఈయన, బిల్‌గేట్స్ బాల్య స్నేహితులు. 1970ల్లో మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా ఎన్నో అద్భుత ఉత్పత్తులను ప్రపంచానికి అందజేశారు. ప్రపంచంలో సాంకేతిక విప్లవానికి కారకులయ్యారు.
పాల్ అలెన్ (65) చొరవతో అనేక పరిశోధనా సంస్థలను స్థాపించారు. సాంకేతిక, వైద్య పరిశోధనలను ప్రోత్సహించారు. పాల్ అలెన్ అనేక సేవా సంస్థలకు పెద్దమొత్తంలో ఆర్ధిక సహాయం చేశాడు. మైక్రోసాప్ట్‌తో పాటు అనేక వ్యాపారాలు చేసిన ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరుగా నిలిచారు.
వన్యప్రాణి సంరకణ, ఎడ్యుకేషన్, వైద్యం, సైన్స్ వంటి రంగాల అభివృద్ధి కోసం తన సంపదలో 15 వేల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. తన మరణానంతరం తాను సంపాదించిన దానిలో అత్యధికభాగం సేవా కార్యక్రమాలకు చెందాలని వీలునామా రాశారు.
కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న అలెన్ సోమవారం నాడు కన్నుమూశారు.