అక్కడ జగన్‌ వస్తాడు.... బాబు ఇటు వస్తాడు....

తెలంగాణ తాజా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎందుకు తెలంగాణ రాజకీయాల్లోకి వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారో వివరించారు. మీడియాతో మాట్లాడిన నాయిని నర్సింహారెడ్డి…. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్‌ అధికారంలోకి రాబోతున్నారని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఓడిపోతున్నారని చెప్పారు. జగన్‌ ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు వెంటనే హైదరాబాద్‌కు మకాం మారుస్తారని నాయిని వ్యాఖ్యానించారు. ఏపీలో అధికారం కోల్పోబోతున్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. అందుకే తెలంగాణలో […]

Advertisement
Update:2018-10-09 02:53 IST

తెలంగాణ తాజా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎందుకు తెలంగాణ రాజకీయాల్లోకి వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారో వివరించారు. మీడియాతో మాట్లాడిన నాయిని నర్సింహారెడ్డి…. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్‌ అధికారంలోకి రాబోతున్నారని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఓడిపోతున్నారని చెప్పారు.

జగన్‌ ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు వెంటనే హైదరాబాద్‌కు మకాం మారుస్తారని నాయిని వ్యాఖ్యానించారు. ఏపీలో అధికారం కోల్పోబోతున్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసన్నారు.

అందుకే తెలంగాణలో టీడీపీ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ఉంటే తాను హైదరాబాద్‌లో కాపురం ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని వివరించారు. కానీ అది అయ్యే పనికాదన్నారు.

ప్రొఫెసర్ కోదండరాం అంటే అందరికీ గౌరవం ఉందని…. కానీ ఆయన కేవలం మూడు అసెంబ్లీ సీట్ల కోసం కాంగ్రెస్‌ చుట్టూ తిరగడం ఏమాత్రం బాగోలేదన్నారు. కోదండరాం రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయనకే గౌరవప్రదంగా ఉంటుందని నాయిని సలహా ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News