కెప్టెన్ గా విరాట్ ను ఊరిస్తున్న మరో రికార్డు
విండీస్ పై 10 టెస్టుల్లో కొహ్లీ సగటు 38.61 విండీస్ పై కొహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 200 పరుగులు విండీస్ పై గవాస్కర్ 2746 పరుగులు టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా కెప్టెన్ గా ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పిన విరాట్ కొహ్లీ….వెస్టిండీస్ తో జరిగే రెండుమ్యాచ్ ల సిరీస్ లో సైతం మరో రికార్డు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మహ్మద్ అజరుద్దీన్ పేరుతో ఉన్న రికార్డును కొహ్లీ…రాజ్ కోట్ వేదికగా జరిగే […]
- విండీస్ పై 10 టెస్టుల్లో కొహ్లీ సగటు 38.61
- విండీస్ పై కొహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 200 పరుగులు
- విండీస్ పై గవాస్కర్ 2746 పరుగులు
టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా కెప్టెన్ గా ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పిన విరాట్ కొహ్లీ….వెస్టిండీస్ తో జరిగే రెండుమ్యాచ్ ల సిరీస్ లో సైతం మరో రికార్డు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
మహ్మద్ అజరుద్దీన్ పేరుతో ఉన్న రికార్డును కొహ్లీ…రాజ్ కోట్ వేదికగా జరిగే తొలిటెస్టులోనే అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దటీజ్ విరాట్ కొహ్లీ….
విరాట్ కొహ్లీ…ప్రస్తుత టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్. ప్రత్యర్థి ఎవరైనా…..వేదిక ఏదైనా తనదైన స్టయిల్లో పరుగుల మోత మోగించడం….రికార్డు వెంట రికార్డు సాధించడం టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి ఓ అలవాటుగా మారింది.
ఇంగ్లండ్ తో ఇటీవలే ముగిసిన పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన విరాట్ కొహ్లీ….8వ ర్యాంకర్ విండీస్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం… పరుగుల మోత మోగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.
అజార్ రికార్డుకు చేరువగా…
వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ పేరుతో ఉన్న 539 పరుగుల రికార్డుకు….కొహ్లీ కేవలం 37 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు.
విండీస్ పై కెప్టెన్ గా 476 పరుగులు సాధించిన మహేంద్రసింగ్ ధోనీ రికార్డును గతంలోనే అధిగమించిన విరాట్ కొహ్లీ…రాజ్ కోట టెస్ట్ తొలిఇన్నింగ్స్ లోనే….తనదైన శైలిలో బ్యాటింగ్ చేయగలిగితే… అజర్ పేరుతో ఉన్న రికార్డును మించిపోవడం ఏమంత కష్టంకాబోదు.
వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 10 టెస్టు మ్యాచ్ లు ఆడిన కొహ్లీకి 38.61 సగటు మాత్రమే ఉంది. అంతేకాదు…200 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సైతం కొహ్లీకి ఉంది.
సునీల్ గవాస్కర్ టాప్
ఓవరాల్ గా చూస్తే…వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్లలో అలనాటి ఓపెనర్ సునీల్ గవాస్కర్, మాజీ కెప్టెన్, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్, వెరీ వెరీ స్పెషల్ వీవీఎస్ లక్ష్మణ్ మొదటి మూడుస్థానాల్లో కనిపిస్తారు.
అరివీర భయంకర కరీబియన్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఏకంగా 2 వేల 746 పరుగులు సాధించాడు.
ద్రావిడ్ రెండు, లక్ష్మణ్ మూడు….
రాహుల్ ద్రావిడ్ 1978 పరుగులతో….గవాస్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. హైదరాబాదీ స్ట్రోక్ మేకర్ వీవీఎస్ లక్ష్మణ్ 1715 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
విండీస్ పై వ్యక్తిగత రికార్డులు ఎలా ఉన్నా….టాప్ ర్యాంకర్ టీమిండియా ప్రస్తుత సిరీస్ ను 2-0తో సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన కరీబియన్ టీమ్… స్వదేశంలో పులిలాంటి టీమిండియాకు ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.