ఐఎమ్‌ఎఫ్‌ ప్రధాన ఆర్ధికవేత్తగా గీత

భారతదేశానికి చెందిన ఆర్ధికవేత్త గీత ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. భారత్‌లో జన్మించిన గీత ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. ఆర్ధిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. వెంటనే నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రిసర్చ్‌లో, ఆ తరువాత అంతర్జాతీయ ఫైనాన్స్‌, మైక్రోఎకనామిక్స్‌ ప్రోగ్రామ్స్‌ లో కో-డైరెక్టర్‌గా పనిచేశారు. 2016లో కేరళ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారుగా కూడా గీత పనిచేశారు. అంతేకాదు అంతర్జాతీయ సంస్థ జి20 ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహా బృందంలోనూ గీత ఉన్నారు. ఆమె 2001లో […]

Advertisement
Update:2018-10-02 06:10 IST

భారతదేశానికి చెందిన ఆర్ధికవేత్త గీత ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. భారత్‌లో జన్మించిన గీత ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు.

ఆర్ధిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. వెంటనే నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రిసర్చ్‌లో, ఆ తరువాత అంతర్జాతీయ ఫైనాన్స్‌, మైక్రోఎకనామిక్స్‌ ప్రోగ్రామ్స్‌ లో కో-డైరెక్టర్‌గా పనిచేశారు. 2016లో కేరళ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారుగా కూడా గీత పనిచేశారు. అంతేకాదు అంతర్జాతీయ సంస్థ జి20 ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహా బృందంలోనూ గీత ఉన్నారు. ఆమె 2001లో అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి అర్ధశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు.

ఇప్పుడు హార్వార్డ్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ…. ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా ఎంపికయ్యారు. 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ఐఎమ్‌ఎఫ్‌కు మన భారతీయరాలు గీత గోపీనాథ్‌ ప్రధాన ఆర్ధికవేత్త కావడం గొప్పవిశేషం.

Tags:    
Advertisement

Similar News