ఒకేసారి తిన‌కూడ‌ని విరుద్ధ వ‌స్తువులు

మ‌నం భోజ‌నం చేసేట‌ప్పుడు ఆహారంలో గుణ‌ము, స్వ‌భావ‌ము వేరుగా ఉన్న ప‌దార్థాలు తిన‌కూడ‌దు. వాగ్భ‌టులు చెప్పిన విరుద్ధ వ‌స్తువులు ఏమిటో ఇప్పుడు కొన్ని చూద్దాం మొద‌టిది ఉల్లిపాయ‌+పాలు. ఇవి రెండు ఒక దానికి మ‌రొక‌టి బ‌ద్ధ శ‌త్రువులు. ఇవి రెండు క‌లిపి తీసుకుంటే చ‌ర్మ‌సంబంధ‌మైన ఎన్నో జ‌బ్బులు వ‌స్తాయి. గ‌జ్జి, సోరియాసిస్‌, ఎగ్జిమా, దుర‌ద‌లు లాంటివి . రెండ‌వ‌ది ప‌న‌స‌కాయ‌+పాలు. ఇంకా పాల‌తోటి సిట్రిక్ యాసిడ్ ఉండే ఏ ప‌దార్థం కూడా తీసుకోకూడ‌దు. సిట్రిక్ యాసిడ్ ఉండేవి […]

Advertisement
Update:2018-09-27 03:00 IST

మ‌నం భోజ‌నం చేసేట‌ప్పుడు ఆహారంలో గుణ‌ము, స్వ‌భావ‌ము వేరుగా ఉన్న ప‌దార్థాలు తిన‌కూడ‌దు. వాగ్భ‌టులు చెప్పిన విరుద్ధ వ‌స్తువులు ఏమిటో ఇప్పుడు కొన్ని చూద్దాం

మొద‌టిది ఉల్లిపాయ‌+పాలు. ఇవి రెండు ఒక దానికి మ‌రొక‌టి బ‌ద్ధ శ‌త్రువులు. ఇవి రెండు క‌లిపి తీసుకుంటే చ‌ర్మ‌సంబంధ‌మైన ఎన్నో జ‌బ్బులు వ‌స్తాయి. గ‌జ్జి, సోరియాసిస్‌, ఎగ్జిమా, దుర‌ద‌లు లాంటివి .

రెండ‌వ‌ది ప‌న‌స‌కాయ‌+పాలు. ఇంకా పాల‌తోటి సిట్రిక్ యాసిడ్ ఉండే ఏ ప‌దార్థం కూడా తీసుకోకూడ‌దు. సిట్రిక్ యాసిడ్ ఉండేవి – క‌మ‌లాపండు, బ‌త్తాయి, నారింజ‌, ద్రాక్షా వంటి పుల్ల‌టి ప‌దార్థాలు, పాల‌తోపాటుగా తీసుకోద‌గిన ఒకే ఒక పుల్ల‌టి ప‌దార్థం ఉసిరికాయ‌, దీనిలో సిట్రిక్ యాసిడ్‌, సి-విట‌మిన్‌, కాల్షియం ప‌రిపూర్ణంగా ఉంటాయి. అయినా కూడా ఉసిరికాయ మాత్ర‌మే పాల‌తో క‌లిపి తీసుకోద‌గిన‌ది, ఇక ఏ పుల్ల‌టి ప‌దార్థ‌మైనా, మామిడికాయ కూడా పాల‌తో తీసుకోకూడ‌దు పుల్ల‌గా ఉంటే తియ్య‌టి మామిడికాయ తీసుకోవ‌చ్చు.

ఇక నెయ్యి+తేనె క‌లిపి తీసుకోకూడ‌దు. ఇంకా మిన‌ప‌ప్పు+పెరుగు పొర‌పాటున‌కూడ‌ ఒకేసారి తీసుకోవ‌ద్దు. మిన‌ప‌ప్పు ప‌ప్పుల‌న్నింటికీ రారాజు ఇది. దీనితో క‌లిపి పెరుగు (పెరుగు ఆవ‌డ‌) తీసుకోకూడ‌దు. పెస‌ర‌ప‌ప్పు, కందిప‌ప్పు లాంటి వాటితో క‌లిపి, పెరుగు తీసుకోక‌పోవ‌ట‌మే మంచిది. ఒక‌వేళ తీసుకోవ‌ల‌సి వ‌స్తే పెరుగులో తాలింపు చేసుకుని తినాలి, మిన‌ప‌ప్పుతో మాత్రం పెరుగు క‌లిపి ఎట్టి ప‌రిస్థితిల్లో తిన‌కూడ‌దు.

-డాక్ట‌ర్ రాజీవ్ దీక్షిత్‌

Tags:    
Advertisement

Similar News