భారతీయ మహిళలకు మైక్రోసాఫ్ట్‌ ‘సైబర్‌’ శిక్షణ!

భారతీయ మహిళలకు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇండియా, ప్రముఖ ఇన్ఫోటెక్‌ లాబీ గ్రూప్‌ నాస్కామ్‌ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాయి. భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు జరగబోతోంది. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన వెయ్యిమంది మహిళలకు సైబర్‌ సెక్యూరిటీలో ఈ సంస్థలు శిక్షణ అందించబోతున్నాయి. ‘సైబర్‌ శిక్షా ప్రోగ్రామ్‌’గా దీనికి పేరుపెట్టారు. దేశంలోని మొత్తం 10 ప్రాంతాలలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో శిక్షణ […]

Advertisement
Update:2018-09-26 11:30 IST

భారతీయ మహిళలకు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇండియా, ప్రముఖ ఇన్ఫోటెక్‌ లాబీ గ్రూప్‌ నాస్కామ్‌ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాయి. భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు జరగబోతోంది.

సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన వెయ్యిమంది మహిళలకు సైబర్‌ సెక్యూరిటీలో ఈ సంస్థలు శిక్షణ అందించబోతున్నాయి. ‘సైబర్‌ శిక్షా ప్రోగ్రామ్‌’గా దీనికి పేరుపెట్టారు. దేశంలోని మొత్తం 10 ప్రాంతాలలో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో శిక్షణ తీసుకున్న మహిళలకు ఉపాధి కూడా కల్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా నోయిడా, పాట్నా, హైదరాబాద్, మొహాలిలో మహిళలను ఎంపికచేస్తారు. 20 నుంచి 27 ఏళ్లున్న మహిళలు ఇందుకు అర్హులు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫోటెక్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్‌అండ్‌డి డిపార్ట్‌మెంట్‌ అయిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ నేతృత్వంలోని శిక్షణా బృందం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ కార్యక్రమం నాలుగునెలలపాటు ఉంటుంది. ఇందులో భాగంగా ధియరీ, కేస్‌ స్టడీస్, ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లను తయారు చేయడం వంటివి ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News