ఇజ్రాయిల్ పోలీసు డ్రెస్‌లు కుట్టేది ఎవరో తెలుసా?
ఇజ్రాయిల్ పోలీసుల డ్రెస్‌లు ఎవరు తయారు చేస్తే మనకేమిటి అనుకుంటున్నారా.. అందులో ఓ విశేషముంది. వాటిని తయారు చేసేది మనమే. భారత్‌లోనే ఇజ్రాయిల్ పోలీసుల డ్రెస్‌లు తయారవుతున్నాయి. ఉత్తర కేరళ పట్టణమైన కన్నూర్‌లో ఇవి తయారుచేస్తున్నారు. కన్నూర్‌లోని వలియవేలిచమ్‌లో గల ఇండస్ట్రియల్ పార్క్‌లోని ‘మార్యన్ అప్పారెల్ ప్రైవేట్ లిమిటెడ్’ లో వందలాదిమంది దర్జీలు ఈ డ్రెస్‌లు తయారు చేస్తున్నారు. ఇజ్రాయిల్ పోలీసుల షర్ట్‌లు పొడవాటి చేతులు, రెండు జేబులు, ట్రేడ్‌మార్క్ ఎంబ్లమ్‌లతో పూర్తి డిఫరెంట్‌గా ఉంటాయి. ఏడాదికి […]
ఇజ్రాయిల్ పోలీసుల డ్రెస్‌లు ఎవరు తయారు చేస్తే మనకేమిటి అనుకుంటున్నారా.. అందులో ఓ విశేషముంది. వాటిని తయారు చేసేది మనమే. భారత్‌లోనే ఇజ్రాయిల్ పోలీసుల డ్రెస్‌లు తయారవుతున్నాయి. ఉత్తర కేరళ పట్టణమైన కన్నూర్‌లో ఇవి తయారుచేస్తున్నారు.
కన్నూర్‌లోని వలియవేలిచమ్‌లో గల ఇండస్ట్రియల్ పార్క్‌లోని ‘మార్యన్ అప్పారెల్ ప్రైవేట్ లిమిటెడ్’ లో వందలాదిమంది దర్జీలు ఈ డ్రెస్‌లు తయారు చేస్తున్నారు. ఇజ్రాయిల్ పోలీసుల షర్ట్‌లు పొడవాటి చేతులు, రెండు జేబులు, ట్రేడ్‌మార్క్ ఎంబ్లమ్‌లతో పూర్తి డిఫరెంట్‌గా ఉంటాయి. ఏడాదికి లక్షకు పైగానే డ్రెస్‌లు ఇక్కడి నుండి ఇజ్రాయిల్‌కు ఎగుమతి అవుతాయి. థొడుపుజాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త థామస్ ఒలిక్కల్‌కు చెందిన ఈ కంపెనీ గత మూడేళ్ల నుంచి డ్రెస్‌లను ఎగుమతి చేస్తున్నది.
ఈ కంపెనీ నుంచి ఇజ్రాయిల్ పోలీసులకు మాత్రమే కాదు కువాయిట్ ఫైర్ సర్వీస్‌కు, నేషనల్ గార్డ్ సిబ్బందికి కూడా డ్రెస్‌లు సరఫరా చేస్తున్నారు. తాజాగా ఫిలిప్పీన్ ఆర్మీకి యూనిఫాంలు తయారు చేసే కాంట్రాక్టు కూడా ఈ కంపెనీకి లభించిందట. త్వరలో తయారీ ప్రారంభిస్తారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్ పోలీసులలో పురుషులకు, మహిళలకు కూడా ఈ కంపెనీయే యూనిఫాంలు తయారు చేస్తున్నది.
అయితే ఈ సంవత్సరం నుంచి షర్ట్‌లు మాత్రమే తయారు చేస్తారట. ప్యాంట్లు తయారు చేసే కాంట్రాక్టును చైనా కంపెనీ దక్కించుకున్నదని కంపెనీ అధికారి సిజన్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ కాంట్రాక్టు కోసం తాము ప్రయత్నిస్తున్నామని, త్వరలో అదికూడా తమ కంపెనీకే వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
కాంట్రాక్టు ఇవ్వడమే కాదు తరచూ యూనిట్‌ను ఇజ్రాయిల్ పోలీసులు సందర్శిస్తారని, నాణ్యతను, తయారుచేసే క్రమాన్ని పరిశీలిస్తుంటారని సిజన్ కుమార్ వివరించారు. యూనిఫామ్ కుట్టడానికి అవసరమైన మెటీరియల్ అంతా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుందని, గుడ్డను ముంబైలోని కంపెనీ సొంత మిల్లులో ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు. కంపెనీలో 850 మంది పనిచేస్తున్నారని, అందులో ఎక్కువమంది మహిళలని సిజన్ కుమార్ తెలిపారు.