ఆసియాకప్ లో సూపర్ సండే ఫైట్

ఇటు టీమిండియా…. అటు పాకిస్థాన్ వరుస విజయాలతో టీమిండియా టాప్ గేర్ నిలకడలేమికి మరోపేరు పాకిస్థాన్ ఆసియాకప్ సూపర్ ఫోర్…రెండోరౌండ్లో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ మరోసారి ఢీ కొనబోతున్నాయి. సూపర్ ఫైట్…. ఆసియా క్రికెట్ దిగ్గజాలు టీమిండియా, పాకిస్థాన్…మరోసారి ఆసియాకప్ సూపర్ ఫోర్ సమరానికి సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ […]

Advertisement
Update:2018-09-23 04:05 IST
  • ఇటు టీమిండియా…. అటు పాకిస్థాన్
  • వరుస విజయాలతో టీమిండియా టాప్ గేర్
  • నిలకడలేమికి మరోపేరు పాకిస్థాన్

ఆసియాకప్ సూపర్ ఫోర్…రెండోరౌండ్లో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమయ్యింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ మరోసారి ఢీ కొనబోతున్నాయి.

సూపర్ ఫైట్….

ఆసియా క్రికెట్ దిగ్గజాలు టీమిండియా, పాకిస్థాన్…మరోసారి ఆసియాకప్ సూపర్ ఫోర్ సమరానికి సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ లో… విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతున్నాయి.

గ్రూప్- బీ లీగ్ లో మొదటి రెండుస్థానాల్లో నిలవడం ద్వారా… నాలుగు స్తంభాలాటకు అర్హత సంపాదించిన టీమిండియా, పాకిస్థాన్ జట్లు… సూపర్ ఫోర్ తొలిరౌండ్లో సైతం విజయాలు సాధించడం ద్వారా… కీలక రెండోరౌండ్ కు సిద్ధమయ్యాయి.

బంగ్లాదేశ్ తో ముగిసిన సూపర్ ఫోర్ తొలిసమరంలో టీమిండియా ఏడు వికెట్ల అలవోక విజయం సాధిస్తే… చిచ్చర పిడుగు అప్ఘనిస్థాన్ పైన పాక్ జట్టు అతికష్టం మీద మూడు వికెట్లతో విజేతగా నిలిచింది.

రెండోసారి సమరం…

సూపర్ ఫోర్ తొలిరౌండ్ విజయాలతో దూకుడుమీదున్న ఈ రెండుజట్లే తిరిగి రెండోరౌండ్ ఫైట్ లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. గ్రూప్ లీగ్ లో…పాకిస్థాన్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో మరో విజయానికి ఉరకలేస్తోంది.

పాకిస్థాన్ తో పోల్చుకొంటే…ప్రస్తుత టోర్నీలో టీమిండియానే అత్యంత పటిష్టమైన జట్టుగా కనిపిస్తోంది. గ్రూప్ లీగ్ లో… హాంకాంగ్, పాక్ జట్లను, సూపర్ ఫోర్ తొలిరౌండ్లో బంగ్లాదేశ్ ను ఓడించిన రోహిత్ సేన… వరుసగా నాలుగో విజయానికి తహతహలాడుతోంది.

సమతూకంతో భారత్

బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిలార్డర్ ఆటగాళ్లు అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ……బౌలింగ్ లో పేస్ జోడీ భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ల త్రయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, చాహాల్ నిలకడగా రాణిస్తూ ఉండటంతో…టీమిండియా మరోసారి హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

నిలకడలేమితో పాక్

మరోవైపు నిలకడలేమికి మరో పేరైన పాకిస్థాన్ మాత్రం…గ్రూప్ లీగ్ లో ఓ గెలుపు, ఓటమి రికార్డుతో…సూపర్ ఫోర్ రౌండ్ చేరినా…తొలిరౌండ్లో అప్ఘనిస్థాన్ ను అధిగమించినా…ఇప్పుడు..పవర్ ఫుల్ టీమిండియాతో రెండో రౌండ్ సమరానికి సిద్ధమయ్యింది.

సూపర్ సండే ఫైట్ గా జరుగనున్న ఈ సూపర్ ఫోర్ రెండో రౌండ్ పోటీలో టీమిండియా మరోసారి విజేతగా నిలుస్తుందా?…లేక లీగ్ దశ ఓటమికి పాకిస్థాన్ బదులు తీర్చుకొంటుందా?…తెలుసుకోవాలంటే… మరికొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News