నయీంకు ఆయుధాలు దావుద్ ఇచ్చాడా?
గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందులో భాగంగా సిట్ అధికారులు నయీంకి ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. విచారణ ప్రారంభంలో వికారుద్దీనే నయీంకు ఆయుధాలు సమకూర్చాడని భావించిన పోలీసులు ఇప్పుడు దావూద్ పాత్రపై దృష్టి పెట్టారు. నయీం దావూద్ అనుచరులను కలిశాడనే సమాచారం సిట్ వద్ద ఇప్పటికే ఉంది. దీంతో నయీం వద్ద లభించిన ఆయుధాలు, డ్రగ్స్ దావూద్ అనుచరులే ఇచ్చి ఉంటారని సిట్ బృందం […]
Advertisement
గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందులో భాగంగా సిట్ అధికారులు నయీంకి ఆయుధాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. విచారణ ప్రారంభంలో వికారుద్దీనే నయీంకు ఆయుధాలు సమకూర్చాడని భావించిన పోలీసులు ఇప్పుడు దావూద్ పాత్రపై దృష్టి పెట్టారు. నయీం దావూద్ అనుచరులను కలిశాడనే సమాచారం సిట్ వద్ద ఇప్పటికే ఉంది. దీంతో నయీం వద్ద లభించిన ఆయుధాలు, డ్రగ్స్ దావూద్ అనుచరులే ఇచ్చి ఉంటారని సిట్ బృందం అనుమానిస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో నయీం చేతిలో ఏకే-47 ఉంది. అతని ఇంట్లోనూ మరో ఏకే-47ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నయీంపై 500పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే 90 మందిని అరెస్టు చేశారు. వీరందరి వద్దా.. ఏదో ఒక ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఆయుధాలు వీరికి ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు అన్న విషయంలో పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టారు.
ఇక నయీం గ్యాంగ్ డ్రగ్స్ వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నయీం ఇంట్లో చిన్నారులను విచారించిన పోలీసులకు కొన్నివిషయాలు తెలిశాయి. నయీం తమను అత్యాచారం చేసేముందు తమకు ఏదో పొడి తినిపించేవాడని, తాను కూడా ఏదో పొడి తీసుకునేవాడని వారు సిట్ అధికారులకు తెలిపేవారు. చిన్నారులు చెప్పిన సమాచారాన్ని బట్టి నయీం గ్యాంగ్ డ్రగ్స్ ను వినియోగించిందన్న నిర్ధారణకు వచ్చింది. నయీం వద్ద అత్యాధునిక ఆయుధాలు, డ్రగ్స్ కోసం దావూద్ అనుచరులు సాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ దిశగా విచారణ సాగిస్తున్నారు.
Advertisement