లక్షల మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారా?

చంద్రబాబు ఒక డైడ్‌లైన్ అనుకుంటే ఆ లోపు పనైపోయినట్టు కనిపించాలి. తాత్కాలిక సచివాలయం అలాంటిదే. జూన్‌ 27కు పనులు అయిపోవాలని ఆదేశించారు. అనుకున్నట్టుగానే ధూంధాం చేస్తూ తాత్కాలిక సచివాలయంలోకి అడుగుపెట్టారు. డైడ్‌లైన్ లోపు సచివాలయం పూర్తి చేశామని చెప్పుకోవడానికే అలా చేశారు. ఇప్పటికీ అక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. పట్టిసీమ అంతా డెడ్‌లైన్‌లో పూర్తి చేశామనిపించుకునేందుకు ఒకసారి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత నాలుగుసార్లు ప్రారంభించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చంద్రబాబు పోలవరంపై పోకస్ పెట్టారు. 2018నాటికి పోలవరం […]

Advertisement
Update:2016-09-17 11:20 IST

చంద్రబాబు ఒక డైడ్‌లైన్ అనుకుంటే ఆ లోపు పనైపోయినట్టు కనిపించాలి. తాత్కాలిక సచివాలయం అలాంటిదే. జూన్‌ 27కు పనులు అయిపోవాలని ఆదేశించారు. అనుకున్నట్టుగానే ధూంధాం చేస్తూ తాత్కాలిక సచివాలయంలోకి అడుగుపెట్టారు. డైడ్‌లైన్ లోపు సచివాలయం పూర్తి చేశామని చెప్పుకోవడానికే అలా చేశారు. ఇప్పటికీ అక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. పట్టిసీమ అంతా డెడ్‌లైన్‌లో పూర్తి చేశామనిపించుకునేందుకు ఒకసారి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత నాలుగుసార్లు ప్రారంభించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చంద్రబాబు పోలవరంపై పోకస్ పెట్టారు. 2018నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు దాని కోసం ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ ప్రధాన డ్యాం నిర్మాణాన్ని పక్కన పెట్టేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా కాపర్‌ డ్యాంతో సరిపెట్టనున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన సమీక్షలో చంద్రబాబు ఇదే విషయం చెప్పారు.

ఈనాడు పత్రిక కూడా కాపర్ డ్యాం ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ఆలోచన అని సర్టిఫై చేసి జనం మీదకు కథనాన్ని వదిలింది. ప్రధాన డ్యాంకు బదులు తాత్కాలికంగా కాపర్ డ్యాం కట్టి 60 టీఎంసీల నీరు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే చంద్రబాబు నిర్ణయంపై నిపుణులతో పాటు గోదావరి జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 30లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహం ఉండే గోదావరి ధాటికి కాపర్‌ డ్యాం నిలవదని చెబుతున్నారు. కాపర్‌ డ్యాం నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకోలేదని… అలాంటిది 30లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని ఎలా అడ్డుకుంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉధృతంగా పోటెత్తే గోదావరి నదిపై కాపర్‌ డ్యాం నిర్మించడం మించిన తెలివితక్కువ పని మరొకటి ఉండదంటున్నారు. ఇలా చేయడం అంటే లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి ప్రవాహానికి కాపర్‌ డ్యాం దెబ్బతింటే నష్టాన్ని అంచనా వేయడం కూడా సాధ్యం కాదంటున్నారు.

కాపర్‌ డ్యాం అంటే ఏమిటి?

కాపర్‌ డ్యాం అన్నది తాత్కాలిక నిర్మాణం. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పనులకు అడ్డంకి రాకుండా ఉండేందుకు నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు తాత్కాలికంగా నిర్మించే మట్టి నిర్మాణమే కాపర్ డ్యాం. ప్రధాన ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కాపర్ డ్యాం నిరుపయోగం. భారీ వరదను తట్టుకుని నిలబడే శక్తిసామర్ధ్యాలు కాపర్‌ డ్యాంకు ఉండవు. నీటి నిల్వ కోసం కాపర్ డ్యాంను వాడరు. కానీ 2018నాటికి పోలవరం పూర్తి చేశామని ప్రకటించుకుని ఎన్నికలకు వెళ్లేందు కోసం చంద్రబాబు… తాత్కాలిక మట్టి కట్టను అసలు ప్రాజెక్టుగా నమ్మించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద కాపర్ డ్యాం పేరుతో చంద్రబాబు చేస్తున్న పని చాలా ప్రమాదకమైనదని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఒక ప్రధాన పత్రిక కూడా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News