త‌ల‌సానీ.. వీధిరౌడీ భాష మార్చుకో!

కాంగ్రెస్ నాయ‌కుల నాలిక కోస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌పై కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది. ఆయ‌న‌కు తిరిగి అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌జాప్ర‌తినిధిగా కొన‌సాగుతున్న వ్య‌క్తి విలువ‌లు మరిచి మాట్లాడ‌టం త‌గ‌ద‌న్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను నోటికొచ్చిన‌ట్లు దుర్భాష‌లాడితే ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. వీధిరౌడీలా మాట్లాడితే.. బుద్ధి చెబుతామ‌ని హెచ్చరించింది. తెలంగాణ ఉద్య‌మంలో.. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించాక ఈ ప్రాంతానికి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వ్య‌క్తి తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆధ్వ‌ర్యంలో మంత్రిగా ప‌నిచేయ‌డం […]

Advertisement
Update:2016-09-07 03:09 IST
కాంగ్రెస్ నాయ‌కుల నాలిక కోస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌పై కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది. ఆయ‌న‌కు తిరిగి అదే స్థాయిలో కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌జాప్ర‌తినిధిగా కొన‌సాగుతున్న వ్య‌క్తి విలువ‌లు మరిచి మాట్లాడ‌టం త‌గ‌ద‌న్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను నోటికొచ్చిన‌ట్లు దుర్భాష‌లాడితే ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. వీధిరౌడీలా మాట్లాడితే.. బుద్ధి చెబుతామ‌ని హెచ్చరించింది. తెలంగాణ ఉద్య‌మంలో.. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించాక ఈ ప్రాంతానికి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వ్య‌క్తి తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆధ్వ‌ర్యంలో మంత్రిగా ప‌నిచేయ‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు. టీడీపీ త‌ర‌ఫున గెలిచి టీఆర్ ఎస్ త‌ర‌ఫున మంత్రిగా కొన‌సాగుతున్న వ్య‌క్తి విలువ‌ల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మీద గౌర‌వం ఉంటే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి టీఆర్ ఎస్ టికెట్ పై గెలిచి చూపించాల‌ని స‌వాలు విసిరారు.
బాధ్య‌తాయుత‌మైన మంత్రి ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి వీధిరౌడీలా.. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే స‌హించేది లేద‌న్నారు. కాంగ్రెస్ నేత‌ల‌ను దుర్భాష‌లాడితే బుద్ధిచెబుతామ‌ని హెచ్చ‌రించారు. ఈ వివాదానికి ముందు ఏం జ‌రిగిందంటే.. కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్ర్తీయ‌త లేదంటూ సీఎం కేసీఆర్ ను ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో వారు సీఎంను ఏక‌వ‌చ‌నంతో సంభోదించారు. దీనిపై స్పందించిన త‌ల‌సాని ఇలాంటి మాట‌లుమాట్లాడితే నాలిక కోస్తామ‌ని హెచ్చ‌రించారు. దీనిపై కాంగ్రెస్ నేత‌లు ఇలా స్పందించారు. మ‌రి ఈ వివాదం ఇంత‌టితో స‌ద్దుమ‌ణుగుతుందా? మ‌రింత ముదురుతుందా? అన్న‌ది త‌ల‌సాని స్పంద‌నపై ఆధార‌ప‌డి ఉంటుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News