బాబ్బాబు.. టీడీపీకి కార్యాలయం ఇప్పించరూ!
తెలంగాణ తెలుగుదేశం నాయకుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అసెంబ్లీ ప్రాంగణంలో వారి కార్యాలయానికి కేటాయించిన గదులను స్పీకర్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే! దీనిపై తెలుగుదేశం నాయకులు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా మంగళవారం జీఎస్టీ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశం అయిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు స్పీకర్ మధుసూధనాచారిని కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో మేం […]
Advertisement
తెలంగాణ తెలుగుదేశం నాయకుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అసెంబ్లీ ప్రాంగణంలో వారి కార్యాలయానికి కేటాయించిన గదులను స్పీకర్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే! దీనిపై తెలుగుదేశం నాయకులు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా మంగళవారం జీఎస్టీ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశం అయిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు స్పీకర్ మధుసూధనాచారిని కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో మేం ఇంకా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలం పార్టీలోనే ఉన్నామని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం తమకు ఓ కార్యాలయం కేటాయించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. దీంతో స్పీకర్ సభా సమావేశాల అనంతరం కలవాల్సిందిగా సూచించారు. సమావేశాలు ముగిసిన తరువాత స్పీకర్‌ను కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్పీకర్ కార్యదర్శిని ఫోన్ లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో టీడీపీ నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. రెండు రోజుల తరువాత స్పీకర్‌ని మరోసారి కలిసి విజ్ఞప్తి చేయాలన్నది టీడీపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది.
జులైలో అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ ఎస్‌లో చేరిన టీటీడీపీ నేతలంతా కలిసి తమ పార్టీ అసెంబ్లీ శాఖను అధికార పార్టీలో విలీనం చేస్తున్నామంటూ స్పీకర్‌కి ఇచ్చిన లేఖ ఆధారంగా.. అసెంబ్లీ భవన సముదాయంలో టీడీపీకి కేటాయించిన రెండుగదులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరాలు తెలిపినా.. స్పీకర్ వాటిని పట్టించుకోలేదు. అధికారికంగా ఆ పార్టీ నేతల విలీనం పూర్తయినందున.. ఇక ఆ పార్టీకి అసెంబ్లీ ప్రాంగణంలో కార్యాలయం అనవసరం అని స్పీకర్ కార్యాలయం భావించినట్లుంది. అందుకే, టీడీపీ ఆఫీసును ఖాళీ చేయించారు. దీంతో అప్పటి నుంచి అసెంబ్లీ లాబీలో కార్యాలయం లేకపోవడం టీటీడీపీ నేతలంతా అవమానంగా భావిస్తున్నారు. అందుకే, తిరిగి తమ కార్యాలయాన్ని తమకు అప్పగించాల్సిందిగా విన్నవిస్తున్నారు.
Advertisement