ఏపీ మంత్రులకు ర్యాంకులు..పవన్ కళ్యాణ్‌ సంఖ్య ఎంతంటే?

డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరును ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

Advertisement
Update:2025-02-06 18:12 IST

గత ఏడాది డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ మంత్రుల పనితీరు ఆధారంగా ఏపీ మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉండగా... మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలో ఉన్నారు. రాష్ట్ర న్యాయ శాఖ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ తొలి స్థానంలో నిలిచారు.

2వ స్థానంలో కందుల దుర్గేశ్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ 4, డోలా బాలవీరాంజనేయస్వామి 5, సత్యకుమార్ 7, బీసీ జనార్దన్ రెడ్డి 9, సవిత 11, కొల్లు రవీంద్ర 12, గొట్టిపాటి రవికుమార్ 13, నారాయణ 14 టీజీ భరత్ 15, ఆనం రామనారాయణరెడ్డి 16, అచ్చెన్నాయుడు 17, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మిడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20, అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24 నిలిచారు.

Tags:    
Advertisement

Similar News