అమెరికా నుంచి 104 మంది భారత వలసదారుల తరలింపు

అమెరికా నుంచి మొదటి విడతగా 104 మంది అక్రమ వలసదారులు భారత్‌కు చేరుకున్నారు.

Advertisement
Update:2025-02-06 21:47 IST

అమెరికా నుంచి మొదటి విడతగా 104 మంది అక్రమ వలసదారులు భారత్‌కు చేరుకున్నారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటానియో నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ 17.. పంజాబ్‌ అమృత్‌సర్‌‌లోని శ్రీగురు రామదాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ల్యాండయ్యింది. ఈ విమానంలో వచ్చినవారిలో గుజరాత్, హర్యానాకు చెందినవారే అధికంగా ఉన్నారు. గుజరాత్, హర్యానాలు 33 మంది చొప్పున, పంజాబ్‌ 30 మంది, ముగ్గురు మహారాష్ట్ర, ఇద్దరేసి ఛండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందినవారు. మొత్తం 104 మందిలో 25 మహిళలు, 12 మంది చిన్నారులు ఉండగా.. వీరిలో ఒకరి వయసు నాలుగేళ్లు. ఇక, 48 మంది 25 ఏళ్లలోపువారే కావడం గమనార్హం.

అమెరికా నుంచి వెనక్కి పంపేటప్పుడు భారతీయ అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు వేయడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ పేర్కొన్నాది. ఈ సంఘటన పట్ల ఒక భారతీయుడిగా తీవ్ర ఆవేదన చెందుతున్నానని ఆ పార్టీ మీడియా, ప్రచార సెల్‌ అధిపతి పవన్‌ ఖేడా వెల్లడించారు

Tags:    
Advertisement

Similar News