నైజీరియాలో అగ్నిప్రమాదం...17 మంది చిన్నారులు సజీవదహనం
నైజీరియాలో ఓ స్కూల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది చిన్నరులు దుర్మరణం చెందారు
Advertisement
నైజీరియాలో ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జంఫారా రాష్ట్రంలో కైరాన నమోదాలోని ఓ ఇస్లామిక్ స్కూల్‌లో అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బడిలో 100 మంది విద్యార్ధులు ఉన్నారు. స్కూల్ ప్రక్కన నిల్వ ఉంచిన కర్రలను మంటలు అంటుకుని ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
17 మంది పిల్లలు మృతి చెందారని కౌరా-నమోడా స్థానిక ప్రభుత్వ ప్రాంత చైర్మన్ మన్నీర్ మువాజు హైదారా మీడియాకు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిల్వ ఉంచిన కర్రల కుప్ప వల్ల సంభవించాయని, గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తూ మంటలకు ఆహుతయ్యాడని తెలుస్తోంది. దర్యాప్తు జరుగుతోంది.
Advertisement