రేపు వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్

ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Advertisement
Update:2025-02-06 20:31 IST

ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా ఆయన చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన అధికారికంగా వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నాయకులు, శైలజానాథ్ మద్దతుదారులు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున శింగనమల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో పొలిటికల్‌గా క్రియాశీలకంగా ఉండలేకపోయారు.

శైలజానాథ్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. గత కొన్నాళ్లుగా వైసీపీతో ఆయనకు సంబంధాలు పెరుగుతుండటంతో, చివరకు అధికార పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ చేరిక వైసీపీకి మరింత బలం చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో శైలజానాథ్ కు ఉన్న అనుభవం, అతని అనుచర బలం వైసీపీకి ఉపయోగపడే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News