బాబు నా పొలం దున్నారు... చరిత్రలో తొలిసారి ఎండింది
ఎన్నడూ లేని విధంగా గోదావరి డెల్టా ఎండిపోతోంది. చంద్రబాబు స్వయంగా ఏరువాక ప్రారంభించిన భూమే ఇప్పుడు బీటలు వారింది. పట్టిసీమ కారణంగా గోదావరి డెల్టాకు ఎట్టిపరిస్థితుల్లోనూ నీటి కొరత రానివ్వమని చంద్రబాబు చెప్పినప్పటికి రైతుల ఆందోళనే నిజమైంది. ఇప్పుడు గోదావరి డెల్టాలో వరినార్లకు నీరందడం లేదు. తుంగగడ్డి పెరిగిపోయింది. జూన్ 20న ఏరువాక కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో చంద్రబాబు స్వయంగా ట్రాక్టర్ నడిపి పొలం దున్నారు. యంత్రాల సాయంతో వరినాట్లు వేశారు. […]
ఎన్నడూ లేని విధంగా గోదావరి డెల్టా ఎండిపోతోంది. చంద్రబాబు స్వయంగా ఏరువాక ప్రారంభించిన భూమే ఇప్పుడు బీటలు వారింది. పట్టిసీమ కారణంగా గోదావరి డెల్టాకు ఎట్టిపరిస్థితుల్లోనూ నీటి కొరత రానివ్వమని చంద్రబాబు చెప్పినప్పటికి రైతుల ఆందోళనే నిజమైంది. ఇప్పుడు గోదావరి డెల్టాలో వరినార్లకు నీరందడం లేదు. తుంగగడ్డి పెరిగిపోయింది. జూన్ 20న ఏరువాక కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో చంద్రబాబు స్వయంగా ట్రాక్టర్ నడిపి పొలం దున్నారు. యంత్రాల సాయంతో వరినాట్లు వేశారు. ఇప్పుడు స్వయాన చంద్రబాబు నాట్లు వేసిన పొలం కూడా ఎండిపోయింది. ఇప్పటికే పలు గ్రామాల్లో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పంటలకు నీరందె పరిస్థితి లేదు.
ఎన్నడూ తన పొలం ఎండిపోలేదని చంద్రబాబు వరినాట్లు వేసిన పొలం యజమాని పిట్టా ప్రేమ్‌కుమార్ చెప్పారు. చంద్రబాబు తన పొలంలో నాట్లు వేస్తారని అధికారులు చెబితే ఎంతో సంతోషించానన్నారు. కానీ ముఖ్యమంత్రి పంటవేసిన పొలానికి కూడా నీరందడం లేదన్నారు. సీఎం నాట్లు వేసిన చేలో ఇప్పుడంతా తుంగగడ్డి పెరిగిందని వివరించారు. తాను 15ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నానని ఎప్పుడూ తన పొలం ఇలా ఎండిపోలేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు గోదావరి డెల్టా గురించి ఆలోచన చేయాలని రైతు ప్రేమ్ కుమార్ కోరారు.
Click on Image to Read: