నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..పలు అంశాలపై చర్చ

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగునుంది.;

Advertisement
Update:2025-03-06 11:12 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగునుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. శాసన సభలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఈ సమావేశంలో ఆమోదిస్తారు.

అలాగే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే తేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటితో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేస్తారు. 

Tags:    
Advertisement

Similar News