భారత భాగ్య 'సింధూ'రం
ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్ బాట పట్టిన తెలుగమ్మాయి సింధూ చరిత్ర సృష్టించింది. సైనాలాంటి హేమాహేమీలు సాధించలేని మైలురాయిని చేరుకుని శభాష్ అనిపించుకుంది. ఈసారి ఒలింపిక్‌లో పథకం ఖాయం చేసుకున్న రెండో భారత మహిళగా రికార్డు సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థిపై అన్ని సెట్లలో పై చేయి సాధించి ఒలింపిక్ పతకం ఖాయం చేరుకుంది. ప్రపంచ ప్రపంచ బ్యాడ్మింటన్ 6వ ర్యాంకర్ ఒకుహారా(జపాన్)తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు జయకేతనం ఎగరవేసింది. 21-19, […]
Advertisement
ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్ బాట పట్టిన తెలుగమ్మాయి సింధూ చరిత్ర సృష్టించింది. సైనాలాంటి హేమాహేమీలు సాధించలేని మైలురాయిని చేరుకుని శభాష్ అనిపించుకుంది. ఈసారి ఒలింపిక్‌లో పథకం ఖాయం చేసుకున్న రెండో భారత మహిళగా రికార్డు సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థిపై అన్ని సెట్లలో పై చేయి సాధించి ఒలింపిక్ పతకం ఖాయం చేరుకుంది.
ప్రపంచ ప్రపంచ బ్యాడ్మింటన్ 6వ ర్యాంకర్ ఒకుహారా(జపాన్)తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు జయకేతనం ఎగరవేసింది. 21-19, 21-10 వరస సెట్లలో సునాయసంగా ఆధిపత్యం సాధించి ఫైనల్లో బెర్తు ఖరారు చేసుకుని ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో గెలిస్తే.. ఏకంగా స్వర్ణపతకం ఖాయం అవుతుంది. ఒకవేళ ఓడినా కనీసం రజత పతకం వస్తుంది. శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో అమీతుమీకి సిద్ధమైంది సింధు. గురువారం రాత్రి మ్యాచ్‌లో సింధు గెలవగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లో అభిమానులు బాణసంచా కాల్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లో సింధూ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది.
భారతీయులందరూ సింధు విజయానికి గర్వపడ్డారు. మీడియా కూడా తగిన ప్రోత్సాహాన్ని అందించింది. అయితే మన తెలుగు మీడియాలో కొందరు మాత్రం ఈ విజయాన్ని కూడా తమదైన శైలిలో వాడుకున్నారు. ఆమె గెలిచీ గెలవకముందే, రెండు మూడు నిమిషాలు గడవకముందే నాయకుల అభినందనలతో పాటు “ఫలానా” వాళ్లు అభినందించారంటూ స్ర్కోలింగ్ లు రావడం వీక్షకులకు ఆశ్చర్యం కలిగించింది. కొన్ని ఛానల్స్ అయితే ఈ విజయం సింధూదో, గోపీచంద్ దో అర్ధంకానంత కన్ ఫ్యూజ్ చేశాయి.
Advertisement