చిట్టి పొట్ట శ్రీరామరక్షకే...

స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నానని చంద్రబాబు చెబుతున్నారని … సఖ్యతగా ఉండి ఈ రెండేళ్ల కాలంలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీతో సఖ్యతగా లేకుంటే అమరావతిలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేసిన లక్షా 50వేల కోట్ల కుంభకోణం బయటకు వస్తుందని, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, నయీం అనే ఒక […]

Advertisement
Update:2016-08-16 12:43 IST

స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నానని చంద్రబాబు చెబుతున్నారని … సఖ్యతగా ఉండి ఈ రెండేళ్ల కాలంలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీతో సఖ్యతగా లేకుంటే అమరావతిలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేసిన లక్షా 50వేల కోట్ల కుంభకోణం బయటకు వస్తుందని, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, నయీం అనే ఒక విషపు మొక్కను బాబు నాటిన విషయం బయటకు వస్తుందని అందుకే చంద్రబాబు మోదీతో సఖ్యతగా ఉంటున్నారని కోటంరెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు… తన కుమారుడు లోకేష్ చిట్టిపొట్ట బాగుంటే చాలు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ చిట్టి పొట్ట శ్రీరామరక్ష కోసమే మోదీ ముందు చంద్రబాబు మోకరిల్లారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదంటున్న ప్రభుత్వం… మరి విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News