జగన్‌కు ఇది తీవ్ర అవమానమేనా?
పుష్కరాలకు అతిథులను ఆహ్వానించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. తమకు ఇష్టమైన సినిమావాళ్లను, నాయకులను పరుగుపరుగున వెళ్లి ఆహ్వానించిన చంద్రబాబు అండ్ కో … జగన్ విషయంలో కాస్త విచిత్రంగానే వ్యవహరించింది. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకు ఆహ్వానం పలకాల్సి ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం… ఇప్పుడు జగన్‌ను ఆహ్వానిస్తామని ప్రకటించింది. దీంతో అవాక్కవడం వైసీపీ వంతైంది. ఢిల్లీ పెద్దలతో పాటు సుప్రీం కోర్టు జడ్జీలు, సినిమా తారలను ఇంటింటికి వెళ్లి వారం ముందే ఆహ్వానించిన […]
పుష్కరాలకు అతిథులను ఆహ్వానించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. తమకు ఇష్టమైన సినిమావాళ్లను, నాయకులను పరుగుపరుగున వెళ్లి ఆహ్వానించిన చంద్రబాబు అండ్ కో … జగన్ విషయంలో కాస్త విచిత్రంగానే వ్యవహరించింది. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకు ఆహ్వానం పలకాల్సి ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం… ఇప్పుడు జగన్‌ను ఆహ్వానిస్తామని ప్రకటించింది. దీంతో అవాక్కవడం వైసీపీ వంతైంది. ఢిల్లీ పెద్దలతో పాటు సుప్రీం కోర్టు జడ్జీలు, సినిమా తారలను ఇంటింటికి వెళ్లి వారం ముందే ఆహ్వానించిన చంద్రబాబు, ఆయన మిత్రబృందం… పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేతను ఆహ్వానించేందుకు సిద్ధపడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పుష్కరాలు ప్రారంభమైన తర్వాత కొన్ని టీవీ చానళ్లలో ప్రభుత్వం ఈ మేరకు లీకులిచ్చింది. ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే వెళ్లి జగన్‌ను పుష్కరాలకు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇందుకు వైసీపీ నుంచి కూడా ఘాటుగానే రియాక్షన్ వచ్చింది. మీడియాలో వార్తలు రావడంతో ప్రెస్ మీట్ పెట్టిన సీనియర్ నేత పార్థసారథి ”చంద్రబాబు నీ డ్రామాలు అపు” అని మండిపడ్డారు.
పుష్కరాలను ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తారా… అసలు మీకు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద నటుల వరకూ పేరుపేరునా ఆహ్వానం పంపిన చంద్రబాబు… పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తామని చెప్పడం జగన్‌ను తీవ్రంగా అవమానించడేమనన్నారు. ప్రతిపక్ష నేతను అవమానించడం ద్వారా చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. పుష్కరాలను తానే కనిపెట్టినట్టుగా డ్రామాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఏదీ ఏమైనా తనకు ఇష్టమైన నాయకులు, సినిమా తారలు, సుప్రీం కోర్డు న్యాయమూర్తులను వారం ముందే ఆహ్వానించిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీనాయకులను మాత్రం విస్మరించడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. పుష్కరాలు గానీ, రాజధాని కార్యక్రమాలు గానీ ఇవన్నీ తన సొంత సామ్రాజ్యంలో జరుగుతున్న కుటుంబ కార్యక్రమాలు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం రాష్ట్రానికే మంచిది కాదు.
Click on Image to Read: