చంద్రబాబు, లోకేష్‌ స్నానమాచరించిన తీరుపై విమర్శలు

కృష్ణ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ దుర్గాఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా స్నానమాచరించారు. కృష్ణా నదికి పూజలు చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కలిసి స్నానం చేశారు. అయితే వారిద్దరూ కృష్ణలో మూడు మునకలు వేసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు, లోకేష్ శరీరాలు పూర్తిగా నీటిలో మునగలేదు. తండ్రికొడుకు కేవలం నీటిలో వాలుగా మునిగి కేవలం ముఖం మాత్రమే తడిచేలా స్నానమాచరించారు. తల పైభాగం, వీపు నీటిలో మునగలేదు. సాధారణంగా ఎవరైనా సరే […]

Advertisement
Update:2016-08-12 03:57 IST

కృష్ణ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ దుర్గాఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా స్నానమాచరించారు. కృష్ణా నదికి పూజలు చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కలిసి స్నానం చేశారు. అయితే వారిద్దరూ కృష్ణలో మూడు మునకలు వేసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు, లోకేష్ శరీరాలు పూర్తిగా నీటిలో మునగలేదు. తండ్రికొడుకు కేవలం నీటిలో వాలుగా మునిగి కేవలం ముఖం మాత్రమే తడిచేలా స్నానమాచరించారు. తల పైభాగం, వీపు నీటిలో మునగలేదు. సాధారణంగా ఎవరైనా సరే పుణ్యస్నానమాచరించేటప్పుడు నిలువుగా పూర్తిగా నీటిలో మునుగుతారు.

కానీ చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రం ఇబ్బందికరంగా ముఖాలు మాత్రమే నీటిలో ముంచారు. పైగా దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో షార్ట్‌ ఫిల్మ్ కూడా చిత్రీకరిస్తున్నారు. కనీసం బోయపాటి అయినా డైరెక్షన్ చేయలేదేమో!. పవిత్రస్నానమాచరించేటప్పుడు పూర్తిగా మునిగితే షార్ట్ ఫిల్మ్‌లో దృశ్యాలు బాగా వస్తాయి కదా!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News