ట్రంప్‌ని మా ఆయ‌న‌....అన‌బోయి నాలుక కరుచుకున్న హిల్ల‌రీ!

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డోనాల్డ్ ట్రంప్‌తో పోటీ ప‌డుతున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్య‌ర్థి  హిల్ల‌రీ క్లింట‌న్ ఒక ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ట్రంప్‌ని నా భ‌ర్త‌…అన‌బోయి వెంట‌నే త‌మాయించుకున్నారు. హ‌స్బెండ్‌లోని హ‌స్‌…వ‌ర‌కు ఆమె  ప‌లికేయ‌టంతో స‌మావేశ హాలులో  న‌వ్వులు వినిపించాయి. నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ బ్లాక్ జ‌ర్నలిస్ట్స్,  నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ హస్పానిక్ జ‌ర్న‌లిస్ట్స్ సంస్థ‌లు వాషింగ్ట‌న్‌లో నిర్వ‌హించిన సంయుక్త స‌మావేశంలో ఆమె ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆమె, అమెరికా ఆర్థిక విధానం […]

Advertisement
Update:2016-08-06 01:31 IST

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డోనాల్డ్ ట్రంప్‌తో పోటీ ప‌డుతున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ ఒక ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ట్రంప్‌ని నా భ‌ర్త‌…అన‌బోయి వెంట‌నే త‌మాయించుకున్నారు. హ‌స్బెండ్‌లోని హ‌స్‌…వ‌ర‌కు ఆమె ప‌లికేయ‌టంతో స‌మావేశ హాలులో న‌వ్వులు వినిపించాయి.

నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ బ్లాక్ జ‌ర్నలిస్ట్స్, నేష‌న‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ హస్పానిక్ జ‌ర్న‌లిస్ట్స్ సంస్థ‌లు వాషింగ్ట‌న్‌లో నిర్వ‌హించిన సంయుక్త స‌మావేశంలో ఆమె ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆమె, అమెరికా ఆర్థిక విధానం ఉన్న‌త వ‌ర్గాల వారికే కాక ప్ర‌తి అమెరిక‌న్‌కి ఉప‌యోగ‌ప‌డాల‌ని చెబుతూ…ఈ విష‌యంపై త‌మ విధానాల‌కు త‌మ‌ ప్ర‌త్య‌ర్థి విధానాల‌కు ఉన్న తేడాని త‌న వెబ్‌సైట్‌లోని వివ‌రాల ద్వారా పోల్చి చూడాల్సిందిగా కోరుతూ…..మై అపోనెంట్ అనే బ‌దులు…మై హ‌స్బెండ్ అన‌బోయారు. వెంట‌నే ఆమె… ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా ఆ పొర‌బాటుని న‌వ్వుతూనే స‌రిదిద్దుకున్నారు. అయితే హిల్ల‌రీ పొర‌బాటు నుండి దొర్లిన హాస్యంపై ట్విట్ట‌ర్‌లో కూడా చాలామంది స్పందించారు.

Tags:    
Advertisement

Similar News