మామకు ప్రేమతో..!
ఇదేంటి నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ లో పదాలు మారాయి అనుకుంటున్నరా? నిజమే పాత్రలు మారాయి కాబట్టి పదాలు కూడా మారాయి. విషయమేంటంటే.. మల్లన్నసాగర్ విషయాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని హరీశ్ తిప్పికొట్టారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్ రావు మరోసారి తన పేరు నిలబెట్టుకున్నారు. గత నెల 25న మంత్రి హరీశ్, మరికొందరు ఇంజినీర్లు కలిసి ఆస్ట్రియా, జపాన్ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. అంతకుముందు రోజు ఎర్రవల్లి, పెన్ పహాడ్ […]
Advertisement
ఇదేంటి నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ లో పదాలు మారాయి అనుకుంటున్నరా? నిజమే పాత్రలు మారాయి కాబట్టి పదాలు కూడా మారాయి. విషయమేంటంటే.. మల్లన్నసాగర్ విషయాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని హరీశ్ తిప్పికొట్టారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్ రావు మరోసారి తన పేరు నిలబెట్టుకున్నారు. గత నెల 25న మంత్రి హరీశ్, మరికొందరు ఇంజినీర్లు కలిసి ఆస్ట్రియా, జపాన్ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. అంతకుముందు రోజు ఎర్రవల్లి, పెన్ పహాడ్ ప్రజలు రాజీవ్ రహదారి దిగ్బంధనానికి ప్రయత్నించారు. ఈ ఆందోళనలో టీడీపీ- సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు. విషయం బాగా సంచలనం కావడం, అదే సమయంలో ఎంసెట్-2 లీకేజీ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వానికి వరుస దెబ్బలు తగిలాయి.
ఇక లాభం లేదునుకుని తన విదేశీ పర్యటన పక్కన బెట్టారు హరీశ్. వెంటనే గ్రామస్థులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పెన్‌పహాడ్ గ్రామస్థులు ఒప్పుకున్నారు. కానీ, ఎర్రవల్లి గ్రామస్థులు మాత్రం ససేమీరా అన్నారు. అయితే, ఇక్కడే హరీశ్ తన మార్కు రాజకీయ ప్రదర్శించారు. ఏపీలో రైతుల భూములను అక్కడి ప్రభుత్వం ఎలా అన్యాయంగా లాక్కుంటుందో వారికి వివరించారు. అందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగులు చూపించారు. రైతుల పొలాలు తగులబెడుతున్న తీరు, పోలీసులతో బెదిరింపు పర్వాలు అన్నీ కళ్లకు కట్టినట్లుగా వివరించారు. పైగా అక్కడ నోరుమెదపని టీడీపీ- సీపీఎంలు ఇక్కడ భూ నిర్వాసితుల పోరాటం చేయడం వెనక ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని వారికి వివరించారు.
మీ అవసరాలను అడ్డుగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారిని నమ్మకండి అని విన్నవించారు. హరీశ్ మాటలతో సంతృప్తి చెందిన ఎర్రవల్లి ప్రజలు తమ భూములు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో మరోసారి మామకు ప్రేమతో మరో విజయాన్ని అందించాడు హరీశ్!
Advertisement