కమలనాథులది ఆనందమా? ఆందోళనా?
రెండు రాజ్యాల సైనికులు భీకరంగా పోరాడుతున్న వేళ ఆయా రాజ్యాల రాజులు భుజంభుజం కలుపుకుని కనిపిస్తే.. ఈ సైనికుల ముఖాలు ఎలా ఉంటాయి. సరిగ్గా ఇలాగే ఉంది తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి. ఇంతకాలం టీఆర్ ఎస్‌ను తిట్టిపోస్తూ వచ్చిన బీజేపీ మోదీ పర్యటనతో అంతర్మథనంలో పడింది. రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి మోదీ తెలంగాణలో ఆగస్టు 7న పర్యటించనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తరువాత మోదీ వస్తున్నందుకు సంతోషపడాలో లేక టీఆర్ ఎస్ […]
Advertisement
రెండు రాజ్యాల సైనికులు భీకరంగా పోరాడుతున్న వేళ ఆయా రాజ్యాల రాజులు భుజంభుజం కలుపుకుని కనిపిస్తే.. ఈ సైనికుల ముఖాలు ఎలా ఉంటాయి. సరిగ్గా ఇలాగే ఉంది తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి. ఇంతకాలం టీఆర్ ఎస్‌ను తిట్టిపోస్తూ వచ్చిన బీజేపీ మోదీ పర్యటనతో అంతర్మథనంలో పడింది. రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి మోదీ తెలంగాణలో ఆగస్టు 7న పర్యటించనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తరువాత మోదీ వస్తున్నందుకు సంతోషపడాలో లేక టీఆర్ ఎస్ ఆహ్వానం మేరకు వస్తున్నందుకు బాధపడాలో కమలనాథులకు అర్థం కావడం లేదు. ఎలాగూ మోదీ పర్యటన ఖరారైంది. గత పరిణామాలు చూస్తుంటే బీజేపీకి చెందిన ఏ కేంద్రమంత్రి తెలంగాణలో పర్యటించినా.. వారికి, పార్టీకి భంగపాటే జరిగింది. ఈ నేపథ్యంలో మోదీ వచ్చినా.. ఆ క్రెడిట్ గులాబీ పార్టీకే దక్కుతుందేమోనని కమలనాథులు ఆందోళన పడుతున్నారు.
గతంలో జరిగిన భంగపాట్లు ఇవే!
1. తెలంగాణకు ఏపీ కరెంటు ఇచ్చేది లేదని తెగేసి చెప్పినా పట్టించుకోలేదు కేంద్రం. కానీ, ఓటుకు నోటు కేసు వెలుగుచూడగానే కేంద్ర విద్యత్తుశాఖ మంత్రి పియూష్ గోయాల్ ఆఘమేఘాలమీద హైదరాబాద్‌కు వచ్చారు. ఇద్దరు సీఎంలతో మాట్లాడారు. ఇద్దరి మధ్య సయోధ్య కోసం వచ్చారా? అని మీడియా అడిగితే.. అదేం లేదు అంటూ తుర్రుమన్నారు.
2. తరువాత కేంద్రమంత్రి హర్షవర్దన్ నాంపల్లి జరిగిన పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ రాలేదు. (వాస్తవానికి కిషన్‌రెడ్డి ఆ సభకు రాజాసింగ్‌కు ఆహ్వానం పంపలేదని రాజాసింగ్ అనుచరుల ఆరోపణ.) ఎందుకో తెలుసుకుందామని కేంద్రమంత్రి స్వయంగా రాజాసింగ్‌కు ఫోన్ చేశారు. దీంతో ఫోన్ పెట్టెయ్ అంటూ అవతలి నుంచి వచ్చిన సమాధానంతో అవాక్కయ్యారు హర్షవర్దన్.
3. మరో మంత్రి రాధాసింగ్ మోహన్ వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారంలో ఇక్కడే క్యాంప్ పెట్టారు. కానీ, ఆయన మాటలు ఎవరూ నమ్మలేదు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు.
4. గ్రేటర్ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో ప్రచారానికి వచ్చిన బీజేపీ కేంద్రమంత్రులు ఫలితాలు చూసిన తరువాత కళ్లు తిరిగినంత పనైంది.
5. ఇటీవల సూర్యాపేట సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో ఆరోపణలు చేశారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వాస్తవాలు వెల్లడించడంతో కమలనాథులు తోకముడిచారు.
ఇలా ఏ సందర్భం తీసుకున్నా.. ఇక్కడ బీజేపీకి అంతగా కలిసి రావడం లేదు. మోదీ పర్యటన అయినా..పార్టీకి మేలు చేస్తుందని ఆశాభావంగా ఉన్నారు కమలనాథులు.
Advertisement