రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతా : సీఎం రేవంత్‌

రెండో సారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు;

Advertisement
Update:2025-03-15 21:10 IST

తెలంగాణకు రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతాని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటిసారి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారని సీఎం అన్నారు. 25 లక్షల పైచిలుకు రుణమాఫీ జరిగింది.. ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్నా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి మంది దాటిందని సీఎం అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా.. మహిళలు ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో తెలిపారు. గతంలో నేను చెప్పింది జరిగింది.. భవిష్యత్‌లోనూ నేను చెప్పిందే జరుగుతుంది. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు వందశాతం బకాయిలు చెల్లిస్తాం. ఆదాయాన్ని పెంచి..పేదలకు పంచడమే మా విధానం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Tags:    
Advertisement

Similar News