జై కొట్టడమే జాతీయవాదం కాదు...

భారత్‌మాతాకీ జై అంటూ కేకలు పెట్టడం, జెండాలు ఊపుతూ వాహనాలమీద తిరగడం, నినాదాలు చేయడం జాతీయవాదం కాదని ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌ పేర్కొన్నారు. జాతీయవాదం మీద ఆమె రాసిన పుస్తకంలో భారతదేశంలో జాతీయవాదం అంటే భారత్‌మాతాకీ జై అంటూ అరవడమే జాతీయవాదమనుకుంటున్నారని, కానీ నిజానికి జాతీయవాదం అంటే దేశాన్ని ప్రేమించడమని, జాతిని ప్రేమించడమని, సాటి మనిషిని ప్రేమించడమని రాశారు. జాతి అవసరాలను తీర్చడానికి కృషిచేయడం, జాతిపట్ల నిబద్ధతతో అంకితభావంతో వ్యవహరించడమే జాతీయవాదమని చెప్పారు. దేశాన్ని, సమాజాన్ని, […]

Advertisement
Update:2016-07-30 11:10 IST

భారత్‌మాతాకీ జై అంటూ కేకలు పెట్టడం, జెండాలు ఊపుతూ వాహనాలమీద తిరగడం, నినాదాలు చేయడం జాతీయవాదం కాదని ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌ పేర్కొన్నారు. జాతీయవాదం మీద ఆమె రాసిన పుస్తకంలో భారతదేశంలో జాతీయవాదం అంటే భారత్‌మాతాకీ జై అంటూ అరవడమే జాతీయవాదమనుకుంటున్నారని, కానీ నిజానికి జాతీయవాదం అంటే దేశాన్ని ప్రేమించడమని, జాతిని ప్రేమించడమని, సాటి మనిషిని ప్రేమించడమని రాశారు. జాతి అవసరాలను తీర్చడానికి కృషిచేయడం, జాతిపట్ల నిబద్ధతతో అంకితభావంతో వ్యవహరించడమే జాతీయవాదమని చెప్పారు. దేశాన్ని, సమాజాన్ని, సాటి ప్రజల్ని అర్ధంచేసుకొని, అవగాహనతో ఈ సమాజంలో ఉంటూ ఈ సమాజ అభ్యున్నతికి కృషిచేయడమే జాతీయవాదం అన్నారు.

భారత్‌మాతాకీ జై అననివాళ్లను జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని నిజానికి దేశ ద్రోహులు, ఆర్థిక నేరస్తులు, పన్నులు చెల్లించనివాళ్లు, విదేశాల్లో నల్లదనం దాచుకునే వాళ్లు జాతి వ్యతిరేకులుగా గుర్తించాలని పేర్కొన్నారు. జాతీయవాదం అంటే ఏమిటో మనకు ఒక అవగాహన ఉంటే ఎవరూ జాతి వ్యతిరేకులో, ఎవరు దేశ భక్తులో అర్థమవుతుందన్నారు.

Tags:    
Advertisement

Similar News