షాంపూ అనుకుని అది వాడిన అమ్మాయికి బట్టతల !
కుడి ఎడమైతే.. పొరపాటు ఉందో లేదో తెలియదు గానీ.. షాంపూ అనుకుని వేరే క్రీములు రాసుకుంటే కొంపలు కొల్లేరవడం ఖాయం. అమెరికాలో ఓ యువతి షాంపూ అనుకుని హెయిర్ రిమూవల్ క్రీమ్ రాసుకుంది. ఇంకేముంది. తలకు జుట్టు పెరగడం అటుంచి ఉన్న జుట్టు ఊడి బట్టతలగా మారింది. ఇప్పుడు ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గామారింది. అమెరికాలోని మాసాచ్యూసెట్స్ లో కాయ్‌లా కానర్స్ అనే యువతికి ఓ సోదరి ఉంది. మొన్నీమధ్య స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. అక్కడ […]
By - sarviUpdate:2016-07-30 03:45 IST
కుడి ఎడమైతే.. పొరపాటు ఉందో లేదో తెలియదు గానీ.. షాంపూ అనుకుని వేరే క్రీములు రాసుకుంటే కొంపలు కొల్లేరవడం ఖాయం. అమెరికాలో ఓ యువతి షాంపూ అనుకుని హెయిర్ రిమూవల్ క్రీమ్ రాసుకుంది. ఇంకేముంది. తలకు జుట్టు పెరగడం అటుంచి ఉన్న జుట్టు ఊడి బట్టతలగా మారింది. ఇప్పుడు ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గామారింది. అమెరికాలోని మాసాచ్యూసెట్స్ లో కాయ్‌లా కానర్స్ అనే యువతికి ఓ సోదరి ఉంది. మొన్నీమధ్య స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. అక్కడ షాంపూ, హెయిర్ రిమూవల్ క్రీమ్ పక్కపక్కనే ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించని ఆ యువతి తలకు హెయిర్ రిమూవల్ క్రీమ్ రాసుకుంది. ఎంతసేపటికీ నురుగు రావడం లేదేంటని కళ్లు తెరిచి చూసుకుంటే.. బాత్‌రూమ్ అంతా ఆమె జుట్టు ఊడి పడి ఉంది. చేతిలో ఒంటి మీద ఎక్కడ చూసినా తన పొడవాటి కురులే పడి ఉన్నాయి. ఏం జరిగిందో అర్థం కాక కెవ్వుమని అరిచింది. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అసలు విషయం తెలిసింది. కానర్ సోదరి షాంపూనకు బదులుగా హెయిర్ రిమూవల్ క్రీమ్ తలకు రాసుకుందని, పాపం! జరిగిన ఘటనకు నవ్వాలో..ఏడవాలో అర్థం కాలేదు వారికి. అందుకే, షాంపూలను, హెయిర్ రిమూవల్ క్రీమ్ లను ఎప్పుడూ పక్కపక్కన పెట్టకండి అని తన సోదరికి జరిగిన ఘటనను వివరిస్తూ ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, సదరు యువతి పేరు మాత్రం రాయలేదు కానర్. అన్నట్లు ఆ యువతి జట్టు ఊడిపోవడానికి కారణమైన హెయిర్ రిమూవల్ క్రీమ్ ను కూడా పోస్టు చేసింది. ఆమె జుట్టు ఏమోగానీ ఇప్పుడు ఆ హెయిర్ రిమూవల్ క్రీమ్ కు బోలెడంత డిమాండ్ ఏర్పడిందట…