ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డా " జగన్

నావి విమానంతో పాటు గల్లంతయిన నావీ సిబ్బంది కుటుంబసభ్యులను విశాఖలో జగన్ పరామర్శించారు. అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భూపేంద్ర సింగ్ ఎగ్జామినర్‌గా ఉన్నారు. విశాఖ మర్రిపాలెంలో నివాసం ఉంటున్న భూపేంద్రసింగ్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ధైర్యంగా ఉండాల్సిందిగా సూచించారు. తన తండ్రి వైఎస్ హెలికాప్టర్ మిస్ అయినప్పుడు తాము కూడా చాలా టెన్షన్ పడ్డామన్నారు. ఆ సమయం ఎంత కష్టంగా ఉంటుందో తాను […]

Advertisement
Update:2016-07-25 10:57 IST

నావి విమానంతో పాటు గల్లంతయిన నావీ సిబ్బంది కుటుంబసభ్యులను విశాఖలో జగన్ పరామర్శించారు. అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భూపేంద్ర సింగ్ ఎగ్జామినర్‌గా ఉన్నారు. విశాఖ మర్రిపాలెంలో నివాసం ఉంటున్న భూపేంద్రసింగ్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్ వారికి ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ధైర్యంగా ఉండాల్సిందిగా సూచించారు. తన తండ్రి వైఎస్ హెలికాప్టర్ మిస్ అయినప్పుడు తాము కూడా చాలా టెన్షన్ పడ్డామన్నారు. ఆ సమయం ఎంత కష్టంగా ఉంటుందో తాను కూడా అనుభవించానన్నారు. గల్లంతయిన వారు క్షేమంగా ఉండాలని జగన్ ఆకాంక్షించారు.

ఈనెల 20న గల్లంతైయిన నావీ విమానంలో మొత్తం 29 మందిఉన్నారు. వారంతా గల్లంతయ్యారు. విమానం ఆచూకీ కోసం ఉధృతంగా గాలింపు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలను చంద్రబాబు కూడా ఇది వరకు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News