సానియాను ఆ కోణంలో టార్గెట్‌ చేసిన నెటిజన్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతున్నారు. గవర్నర్ నుంచి సినీ హీరోహీరోయిన్ల వరకూ ప్రత్యేకంగా వచ్చి మొక్కలు నాటారు. అదే స్పూర్తితో ప్రజలు కూడా హరితహారంలో పాల్గొన్నారు. అయితే సానియా మీర్జా మాత్రం ఎక్కడా కనిపించలేదు. అది ఆమె ఇష్టం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. ఆ పేరు చెప్పే కేసీఆర్ చేతుల మీదుగా కోటి రూపాయల ప్రజాధనాన్ని […]

Advertisement
Update:2016-07-18 05:59 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతున్నారు. గవర్నర్ నుంచి సినీ హీరోహీరోయిన్ల వరకూ ప్రత్యేకంగా వచ్చి మొక్కలు నాటారు. అదే స్పూర్తితో ప్రజలు కూడా హరితహారంలో పాల్గొన్నారు. అయితే సానియా మీర్జా మాత్రం ఎక్కడా కనిపించలేదు. అది ఆమె ఇష్టం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. ఆ పేరు చెప్పే కేసీఆర్ చేతుల మీదుగా కోటి రూపాయల ప్రజాధనాన్ని తీసుకున్నారు.

అలా ఎంచక్కా కోటి రూపాయలు సొంతం చేసుకున్న సానియా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ఎందుకు పాల్గొనలేదన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. పైగా ఆమె ఇటీవల హైదరాబాద్‌లోనే ఉన్నారు. పుస్తకాలు ఆవిష్కరించుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడు ఈ కోణంలోనే సోషల్ మీడియాలో నెటిజన్లు సానియాను టార్గెట్‌ చేశారు. అంబాసిడర్‌ అంటూ కోటి తీసుకెళ్లిన సానియా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. కోటి రూపాయల ప్రజాధనాన్ని సానియాకు అప్పగించిన కేసీఆర్‌ కూడా ఈ విషయంలో చొరవ చూపడం లేదా అని నిలదీస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్లు మనకు అవసరమా అంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News