ఊబకాయులకు శుభ వార్త, నీరు తాగితే ఆకలికి అడ్డుకట్ట
ఊబకాయులు తమ బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. మరో పక్క ఆకలిని ఆపుకోలేక తమకు ఇష్టమైనది అంతా తింటారు. ఇంకేముంది ఊబకాయం మరింత పెరుగుతుంది. అయితే నీరు ఎక్కువగా తాగితే ఆకలికి అడ్డు కట్ట వేయవచ్చని తాజా పరిశోధనలో తేలింది.భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే, కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి ఆకలికి అడ్డుకట్ట పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆహారం తీసుకునేటప్పడు పొట్ట మాటలను మెదడు వినే విషయంలో శాస్త్రవేత్తలకు కొత్త […]
Advertisement
ఊబకాయులు తమ బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. మరో పక్క ఆకలిని ఆపుకోలేక తమకు ఇష్టమైనది అంతా తింటారు. ఇంకేముంది ఊబకాయం మరింత పెరుగుతుంది. అయితే నీరు ఎక్కువగా తాగితే ఆకలికి అడ్డు కట్ట వేయవచ్చని తాజా పరిశోధనలో తేలింది.భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే, కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి ఆకలికి అడ్డుకట్ట పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆహారం తీసుకునేటప్పడు పొట్ట మాటలను మెదడు వినే విషయంలో శాస్త్రవేత్తలకు కొత్త మార్గాలకు దారి చూపినట్లవుతుందని భావిస్తున్నారు. నెదర్లాండ్స్ లోని వాజెనింజెన్ విశ్వవిద్వాలయ పరిశోధకులు తొలిసారిగా..ఆహారం తీసుకునేటప్పుడు మెదడు,పొట్ట, తినేవారిలో సంతృప్తి భావనలను వాస్తవిక రీతిలో పరిశీలించారు. పొట్ట ఎంఆర్ ఐతో పాటు, మెదడుకు ఫంక్షనల్ ఎంఆర్ ఐ స్కానింగ్ చేపట్టడం ద్వారా తినేటప్పుడు పొట్టకు సంబంధించిన సంకేమాతాలను మెదడు ఎలా స్వీకరిస్తుందనే అంశంపై సరికొత్త అంశాలను గ్రహించారు. ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎక్కువగా తాగడం వంటి చిన్నపాటి మార్పుల వల్ల కూడా పొట్ట నిండిదన్న సంకేతాలు మెదడుకు చేరుతున్నట్టు గుర్తించారు. తినేటప్పుడు తాగేనీటి పరిమాణాన్ని పెంచడం ద్వారా పొట్ట విస్తరణ పెరుగుతున్నదని, స్వల్పకాలంలోనే అకలికి అడ్డుకట్ట పడుతోందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా దీని వల్ల మెదడు క్రియాశీలత పెరుగుతున్నదని కూడా వారు గుర్తించారు.
Advertisement