ఫ్రాన్స్‌లో మరోసారి నరమేథం

ఫ్రాన్స్‌పై ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు.ప్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే ఉత్సవాల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఉత్సవాలను వీక్షిస్తున్న జనంపైకి వేగంగా ట్రక్కును నడిపారు. దీంతో 80 మంది చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రక్‌ నడిపిన ఉగ్రవాదిని కాల్చి చంపేశారు. ట్రక్కు దాదాపు రెండు కిలోమీటర్ల మేర జనంపైకి దూసుకొచ్చింది. ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించారు. పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్‌లో దాక్కున్న మరో ఉగ్రవాదిని పోలీసులు […]

Advertisement
Update:2016-07-15 05:49 IST

ఫ్రాన్స్‌పై ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు.ప్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే ఉత్సవాల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఉత్సవాలను వీక్షిస్తున్న జనంపైకి వేగంగా ట్రక్కును నడిపారు. దీంతో 80 మంది చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రక్‌ నడిపిన ఉగ్రవాదిని కాల్చి చంపేశారు. ట్రక్కు దాదాపు రెండు కిలోమీటర్ల మేర జనంపైకి దూసుకొచ్చింది. ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించారు. పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్‌లో దాక్కున్న మరో ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. ఉత్సవాలు జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారు. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News