కోడలి సాయంతో ఫిరాయింపు క్లియర్
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన అప్పారావుకు పార్టీ అధికారంలోకి రాకపోయినా ఎమ్మెల్యేల కోటాలో దక్కిన ఎమ్మెల్సీని జగన్ ఆయనకు కట్టబెట్టారు. కానీ అధికారపార్టీలో అందరూ సంపాదించుకుంటుంటే మనసు చంపుకోలేక ఆయన కూడా ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారట. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లడం వెనుక పెద్ద తంతే నడిచిందని చెబుతున్నారు. అప్పారావు టీడీపీలో ఉండగానే ఎమ్మెల్యే […]
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన అప్పారావుకు పార్టీ అధికారంలోకి రాకపోయినా ఎమ్మెల్యేల కోటాలో దక్కిన ఎమ్మెల్సీని జగన్ ఆయనకు కట్టబెట్టారు. కానీ అధికారపార్టీలో అందరూ సంపాదించుకుంటుంటే మనసు చంపుకోలేక ఆయన కూడా ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారట. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లడం వెనుక పెద్ద తంతే నడిచిందని చెబుతున్నారు. అప్పారావు టీడీపీలో ఉండగానే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో విబేధాలు తీవ్రస్థాయిలో ఉండేవి. దీంతో చౌదరి పోరు పడలేక వైసీపీలోకి వచ్చేశారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి పాత పార్టీలోకి జంప్ చేయాలని ఆదిరెడ్డి అప్పారావు భావించారు. కానీ గోరంట్ల అడ్డుపడుతూ వచ్చారు. అయినా అప్పారావు ప్రయత్నాలు మానలేదు. ఈ విషయం తెలిసే ఆయన చేతిలో ఉన్న శాసనమండలి వైసీపీ పక్ష నేత పదవిని జగన్ తీసివేశారని చెబుతుంటారు. అప్పారావు స్థానంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు ఆ పదవి ఇచ్చారు.
ఒక వైపు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే రాజమండ్రి సిటీ వైసీపీ సమన్వయకర్త పోస్టును తన కుమారుడికి ఇప్పించుకునేందుకు అప్పారావు తెరవెనుక పావులు కదిపారు. కానీ జగన్ ముందు ఆ ఎత్తు కూడా పారలేదని చెబుతున్నారు. చివరకు రాజమండ్రి సిటీ కో- ఆర్టినేటర్ పదవిని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావుకు జగన్ అప్పగించారు. దీంతో వైసీపీలో తన గుట్టు రట్టైందన్న నిర్దారణకు వచ్చిన అప్పారావు… తన వియ్యంకుడి ఫ్యామిలీ సాయంతో వేగంగా పావులు కదిపారని చెబుతున్నారు. అప్పారావు … దివంగత ఎర్రన్నాయుడుకి స్వయాన వియ్యంకుడు. అప్పారావు కుమారుడికి ఎర్రన్నాయుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. దీంతో కోడలి ఫ్యామిలీ సభ్యులైన మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు సాయంతో టీడీపీలో చేరేందుకు అప్పారావు లైన్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడితో గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభ్యంతరాలను కూడా పక్కనపెట్టి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే అప్పారావు తన ఇంటి మీద ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించేశారు. ముహూర్తం చూసుకుని ఫిరాయించడమే మిగిలి ఉందని చెబుతున్నారు.
click on image to read-