ప్రేమాయణంపై కావాల్సినంత క్లారిటీ ఇచ్చిన విశాల్
తమిళనాడులో తనకంటూ ఒకపాలోయింగ్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు…. తమిళ సినీ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేసిన హీరో విశాల్ ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చేశాడు. విశాల్‌కు హీరో శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మితో చాలాకాలంగా ప్రేమాయణం నడిచింది. అయితే శరత్‌కుమార్, ఆయన భార్య రాధిక వీరి ప్రేమకు నో చెప్పారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో తనంటే ఏంటో నిరూపించుకోవాలనుకున్న విశాల్ నడిగర్ ఎన్నికల్లో నేరుగా శరత్‌కుమార్‌తో ఢీకొట్టారు. శరత్‌కుమార్ సుధీర్ఘ ప్రస్తానాన్ని బ్రేక్ చేసిపారేశాడు విశాల్. ఎన్నికల టైమ్‌లో జరిగిన సంఘటనలు […]
By - News DenUpdate:2016-06-29 08:44 IST
తమిళనాడులో తనకంటూ ఒకపాలోయింగ్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు…. తమిళ సినీ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేసిన హీరో విశాల్ ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చేశాడు. విశాల్‌కు హీరో శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మితో చాలాకాలంగా ప్రేమాయణం నడిచింది. అయితే శరత్‌కుమార్, ఆయన భార్య రాధిక వీరి ప్రేమకు నో చెప్పారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో తనంటే ఏంటో నిరూపించుకోవాలనుకున్న విశాల్ నడిగర్ ఎన్నికల్లో నేరుగా శరత్‌కుమార్‌తో ఢీకొట్టారు. శరత్‌కుమార్ సుధీర్ఘ ప్రస్తానాన్ని బ్రేక్ చేసిపారేశాడు విశాల్. ఎన్నికల టైమ్‌లో జరిగిన సంఘటనలు చూసిన వారు ఇకపై విశాల్, వరలక్ష్మి మధ్య ప్రేమ అసాధ్యం అనుకున్నారు. అయితే తాజాగా విశాల్ ట్వీట్ చర్చనీయాంశమైంది
వరలక్ష్మితో చాలా క్లోజ్‌గా దిగిన సెల్ఫీని విశాల్ ట్వీట్ చేశాడు. అంతే కాదు అన్ని ప్రశ్నలకు ఈ ఫొటోనే సమాధానం చెబుతుందని చెప్పేశాడు. ఈ ఫొటో చూస్తే విశాల్ ఉద్దేశం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. వరలక్ష్మికి తాను దూరం కాలేదని… తమది నిజమైన ప్రేమ అని చాటేందుకే విశాల్ ఈ ఫొటోను ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. అయితే విశాల్ ఈ ఫొటో ట్వీట్ చేసిన సమయంలో శరత్ కుమార్ స్వల్ప అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైంది. బహుశా ఫొటో చూసి షాక్ అయి ఉంటారని భావిస్తున్నారు.
Click on Image to Read: