స్పీకర్ మెడకు NTV ఇంటర్వ్యూ... కరెక్ట్‌గా ఉంటే అంబటే ఎమ్మెల్యే

ఇటీవల తెలుగుటీవీ ఛానల్‌ ఎన్‌టీవీకి తాను ఇచ్చిన ఇంటర్వ్యూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మెడకు చుట్టుకుంటోంది. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొన్నటి ఎన్నికల్లో తాను రూ. 11.5కోట్లు ఖర్చుపెట్టానని కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఏపీలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి రూ. 28లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో కోడెల స్వయంగా తాను తీసుకున్న గోతిలోనే పడ్డారు. దీంతో కోడెలపై వైసీపీనేతలు ఈసీకి ఫిర్యాదు చేసింది. మొన్నటి ఎన్నికల్లో కోడెలపై […]

Advertisement
Update:2016-06-28 10:08 IST

ఇటీవల తెలుగుటీవీ ఛానల్‌ ఎన్‌టీవీకి తాను ఇచ్చిన ఇంటర్వ్యూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మెడకు చుట్టుకుంటోంది. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొన్నటి ఎన్నికల్లో తాను రూ. 11.5కోట్లు ఖర్చుపెట్టానని కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఏపీలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి రూ. 28లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో కోడెల స్వయంగా తాను తీసుకున్న గోతిలోనే పడ్డారు. దీంతో కోడెలపై వైసీపీనేతలు ఈసీకి ఫిర్యాదు చేసింది.

మొన్నటి ఎన్నికల్లో కోడెలపై పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు, పార్టీనేతలు రోజా, వాసిరెడ్డి పద్మ, ధర్మశ్రీతో కలిసి వెళ్లి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. కోడెల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా సమర్పించారు. మొన్నటి ఎన్నికల్లో తాను 11. 5కోట్లు ఖర్చుపెట్టానని స్వయంగా కోడెల శివప్రసాదే ఒప్పుకున్నారని కాబట్టి వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలని భన్వర్‌లాల్‌ను అంబటి కోరారు.

కోడెల శివప్రసాద్‌ అంత డబ్బు ఖర్చు పెట్టినా తనపై కేవలం 924 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారని అంబటి రాంబాబు చెప్పారు. ఒకవేళ కోడెల నిబంధనల ప్రకారం డబ్బు ఖర్చు పెట్టి ఉంటే ఎమ్మెల్యేగా గెలిచేవారు కాదని… ఈ రోజు స్పీకర్‌ చైర్‌లో కూర్చునే వారు కాదన్నారు. స్వయంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాన్ని బహిరంగంగా ఒప్పుకుని తిరుగుతున్న శివప్రసాదరావు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తమకు లేదన్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న కోడెలను చంద్రబాబు కావాలనే స్పీకర్‌గా నియమించినట్టుగా ఉందని అంబటి ఆరోపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News